అలనాటి మేటి సినీ నేపథ్య గాయని కె. రాణి (75) ఇకలేరు.. పది సంవత్సరాల వయసులోనే దేవదాసు చిత్రంలో "అంతాభ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా " అంటూ విషాదకర పాటతో పాపులర్ అయిన రాణి, హైదరాబాద్ కళ్యాణ్ నగర్ లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంట రాత్రి 9.10 నిముషాలకు కన్నుమూశారు. ఈ విషయాన్ని రాణి చిన్న కుమార్తె కవిత ధృవీకరించారు. 9వ యేట సినీరంగ నేపథ్యగాయనిగా అరంగేట్రం చేసిన రాణి 1951 నుంచి గాలివీటి సీతారామిరెడ్డి ని వివాహం చేసుకునే వరకూ షుమారు 500 పాటలు పలు భాషల్లో ఆలపించారు. శ్రీలంక జాతీయగీతం ఆలపించిన ఘనత కూడా రాణి కి దక్కింది. "ఇన్నిసాయ్ రాణి" అని అప్పటి జాతీయ కాంగ్రెస్ నేతకె. కామరాఙ్ ఆమెని కీర్తించారు. భారత రాష్ట్రపతి భవన్ లో అప్పటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ తదితరులను ఆమె తన గానామృతంతో ఓలలాడించారు.