కాలా...అసలు హీరో విశాల్

Update: 2018-06-08 08:17 GMT

అభిమన్యుడు సినిమాతో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అదరగొడుతున్న హీరో విశాల్ కేవలం సినిమాల్లోనే కాదు, నిజజీవితంలోనూ హీరోనే అని నిరూపించుకున్నాడు. తమిళనాడుకు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి కష్టం వచ్చినా వెంటనే స్పదించేగుణం విశాల్ ది. తాజాగా రజనీకాంత్...కాలా సినిమాను పైరసీబారి నుంచి కాపాడి విశాల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత్ లో గురువారం కాలా చిత్రం విడుదలైంది. అయితే, బుధవారమే విదేశాల్లో రిలీజ్ కాగా, సింగపూర్ లోని కాథే మల్టీప్లెక్స్ థియేటర్ లో ఓ వ్యక్తి కాలా సినిమాను ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాడు. దీంతో ఈ విషయం విశాల్ చెవిన పడింది. వెంటనే స్పందించిన విశాల్ కేవలం 40 నిమిషాల్లోనే సింగపూర్ లో పైరసీకి పాల్పడుతున్న సదరు వ్యక్తిని అరెస్టు చేయించాడు. దీంతో రిలీజ్ కాకముందే పైరసీకి గురయ్యే భారీ ప్రమాదం నుంచి కాలా చిత్రం భయటపడింది. దీంతో కాలా సినిమాలో రజనీకాంత్ హీరోగా మెప్పిస్తుండగా, సినిమాకి మాత్రం విశాల్ హీరోగా ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు.

చిన్న విషయం కాదు...నేరం...

రజనీకాంత్ రెండేళ్ల తర్వాత తన సినిమాతో వస్తున్నందున తమకు కాలా చిత్రం అతిపెద్దదని హీరో విశాల్ పేర్కొన్నారు. కొందరు ప్రేక్షకులకు సినిమాలో పాటలు, సీన్లు సెల్ ఫోన్లలో చిత్రీకరించడం చిన్న విషయంగా భావిస్తారని, కానీ, అది నేరమని ప్రేక్షకులు గుర్తించాలని కోరారు. భారతదేశం అవతల పైరసీకి పాల్పడుతుండటంతో పట్టుకోవడం కష్టమేనని, అయినా కూడా అతడిని అరెస్టు చేయించామని తెలిపారు. విశాల్ ప్రస్తుతం తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.

Similar News