తమిళ సూపర్ స్టార్ రజని తాజా చిత్రం కాలా విడుదలకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కర్ణాటక లో మాత్రం బ్రేక్ పడింది. కావేరి జలాల వివాదం నేపథ్యంలో కన్నడిగులు తలైవా సినిమాకు నో చెప్పేశారు. ఇది రజని కన్నడ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. ఇటీవల కాలంలో చాలా చిత్రాలకు వివాదాలు ముసురుతున్నాయి. సెన్సార్ సంగతి ఎలా వున్నా చిత్ర నిర్మాతలు కోర్ట్ గుమ్మం ఎక్కక తప్పడంలేదు. కొన్ని సందర్భాల్లో చిత్రం విడుదలకు కోర్ట్ ఎస్ అన్నా ఆందోళనలు థియేటర్లపై దాడులు సాగిపోతున్నాయి. పద్మవత్ చిత్రం దీనికి ఉదాహరణ.
45 నిమిషాలు సామాజిక మాధ్యమాల్లో ...
ప్రపంచ వ్యాప్తంగా కాలా విడుదలైన సందర్భంలో చిత్ర నిర్మాణ దారులకు మరో షాక్ తగిలింది. సింగపూర్ లో ధియేటర్ నుంచి ఒక ప్రేక్షకుడు సినిమా 45 నిమిషాలు ఫెస్ బుక్ లో అప్ లోడ్ చేయడంతో సినిమా బృందం ఆందోళనకు గురైంది. వెంటనే గుర్తించి దాన్ని అడ్డుకోవడంతో కొంతమేరకు నష్ట నివారణ జరిగింది. గతంలో ఇలాగే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా మొదటి భాగం విడుదలకు ముందే బయటకు వచ్చేసింది. అయినప్పటికీ ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఇబ్బంది నిర్మాతకు ఎదురుకాలేదు. ఇప్పుడు కూడా పైరసీ బయటకు వచ్చినా చిత్రం హిట్ అయితే కలెక్షన్లపై ఆ ప్రభావం తక్కువే పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి కాలా చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా నిలిచేలా చేశారు తలైవా.