కళ్యాణ్ రామ్ కి హీరోగా కాలం అస్సలు కలిసిరావడంలేదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఎమ్యెల్యే తో డిజాస్టర్ అందుకుని జయేంద్ర డైరెక్షన్ లో తమన్నాతో కలిసి నా నువ్వే అంటూ మే 25 న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నాడు. కానీ రవితేజ నేల టికెట్ మీద పోటీ ఎందుకనుకున్నారో ఏమో కళ్యాణ్ రామ్ నా నువ్వే సినిమా మే 25 నుండి జూన్ 1 కి వాయిదా పడింది. కళ్యాణ్ రామ్ కి జోడిగా మిల్కి బ్యూటీ తమ్మన్నా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ రోజు నుండి వాయిదా పడిన నా నువ్వే జూన్ 1 న విడుదలకావాల్సి ఉండగా..ఇప్పుడు జూన్ 1 కూడా నా నువ్వే సినిమా విడుదలయ్యే పరిస్థితి కనబడడం లేదు.
సెన్సార్ పూర్తి చేసుకున్నా...
మరి సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న నా నువ్వే ఇప్పుడు గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కానీ కారణంగా సినిమా జూన్ 1 నుండి వాయిదా పడిందని టాక్. రేడియో జాకీ పాత్రలో తమన్నా నటిస్తున్న ఈ మూవీ సెన్సార్ అయ్యాక కూడా ఇంకేం గ్రాఫిక్స్ పనుల వలనో సినిమా విడుదలవడం లేదంటే కాస్త సిల్లీగా వుంది ఈ రీజన్. మరి సినిమా సెన్సార్ అయ్యాక ఇంకేం మెరుగులు దిద్దాలో అంటూ అనేక రకాల కామెంట్స్ ఈ సినిమా నిర్మతల మీద పడుతున్నాయి. అయితే అన్ని పనులు పూర్తి చేసుకుని ఎప్పుడు విడుదల తేదీ ప్రకటిస్తారా అనే ఆసక్తితో నందమూరి ఫాన్స్ ఉన్నారు. ఈ సినిమా కల్యాణ్ రామ్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండబోతోందనే ప్రచారం ఉంది.