'భార‌తీయుడు 2’ కోసం బాగా కష్టపడాలి

Update: 2018-11-29 02:31 GMT

మరో కొన్ని గంటల్లో శంకర్ రూపొందించిన విజువల్ వండర్ '2.0' భవితవ్యం తేలనుంది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈసినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సౌత్ ఇండియాలోనే ఎన్నడూ లేని విధంగా రూ.600 కోట్ల బ‌డ్జెట్‌తో ఈసినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ శంకర్. తన సినిమాలని నెక్స్ట్ లెవెల్ లో చూపించడం శంకర్ కు అలవాటు. అవుట్ ఫుట్ కోసం ఎక్కడ రాజి పడని శంకర్ తన నెక్స్ట్ మూవీ అయినా 'భాయ‌తీయుడు 2' కోసం చాలా కష్టపడాలి అంటున్నాడు.

గతంలో కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'భాయ‌తీయుడు' అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా 'భాయ‌తీయుడు 2'ను తెరకెక్కిస్తున్నాడు శంకర్. డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈసినిమా కోసం 'రోబో 2.0' కి మించి ఎక్కువగా క‌ష్ట‌ప‌డాల‌ని అంటున్నాడు శంక‌ర్‌.

బడ్జెట్ పరంగా కాకపోయినా...శ‌రీర‌కంగా మాన‌సికంగా 2.0 కంటే 'భార‌తీయుడు'కే ఎక్కువ క‌ష్ట‌ప‌డాలి’ అంటున్నాడు. కమల్ హాసన్ తమిళనాడు లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి ‘భార‌తీయుడు 2’ త‌న రాజ‌కీయ ప్రస్థానానికి ఈ సినిమా ఉప‌యోగ‌ప‌డేలా ఉంటుందని కోలీవుడ్ సమాచారం. అయితే ఈసినిమా పాలిటిక్స్ కు ఏమాత్రం సంబంధం లేదని... ఈ కథ కమల్ రాజకీయాల్లోకి రాకముందు రాసుకున్నది అని శంకర్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు

Similar News