బాలీవుడ్ క్వీన్ గా పిలుచునే కంగనా తరచూ ఏదో ఒక హాట్ టాపిక్ లో ఉంటుంది. ఎందుకంటే కంగనా ఏ టాపిక్ అయినా నిర్భయంగా మాట్లాడుతుంది. తన మనసుకు నచ్చింది ఎటువంటి భయం లేకుండా చేసుకుంటూ పోతుంది. ప్రస్తుతం ఆమె రెమ్యూనరేషన్ గురించే బాలీవుడ్ అంత మాట్లాడుకుంటున్నారు. కంగనా సినిమాకి సాధారణంగా 5 - 6 కోట్ల మధ్యలో తీసుకుంటుంది. కానీ ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మణికర్ణిక' సినిమాకు ఏకంగా రూ.14 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఝాన్సీ రాణి లక్ష్మిబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఆమె అంతలా తీసుకుందంటే అంతా ఆశర్యపోతున్నారు. ఇంత రెమ్యూనరేషన్ తీసుకోడంతో ఆమె టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది.
డైరెక్షన్ కూడా చేసిందనేనా..?
ప్రస్తుతం ఆ లిస్ట్ లో దీపిక మాత్రమే ఉంది.. రీసెంట్ గా ఆమె నటించిన చిత్రం 'పద్మావత్' కు దాదాపు ఇదే రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. క్రిష్ 'మణికర్ణిక' ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాక కంగనానే మిగిలిన సినిమాను కంప్లీట్ చేసిందనో ఏమో అంతలా తీసుకుంది. దీపిక లాగా కంగన కూడా లీడ్ రోల్ లో నటిస్తూ రెమ్యూనరేషన్ విషయంలో సంచలనం సృష్టించింది. 'మణికర్ణిక' చిత్రం షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని జనవరి 25న విడుదల అవ్వబోతున్నట్టు ప్రకటించారు.