సాధారణ సెలేబ్రిటిగా బిగ్ బాస్ సీజన్ 2 హౌస్ లోకి అడుగుపెట్టిన బుల్లితెర నటుడు కౌశల్ ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ గా నిలవడం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన రెండు వారాల పాటు సాదాసీదాగా ఉన్న కౌశల్ తర్వాత హౌస్ లో జరిగిన కొన్ని విషయాలతో బాగా హైలెట్ అయ్యాడు. హౌస్ బయట కౌశల్ ఆర్మీ అంటూ కౌశల్ కి ఒక ఫాన్స్ అసోసియేషన్ ఏర్పడడంతో కౌశల్ ఒక శక్తిగా ఎదగడం స్టార్ట్ చేసాడు. ఇక బయటి నుండి హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన పూజ నేరుగా కౌశల్ కి బయట ఒక ఆర్మీ ఉందని చెప్పడం.. ఇక కౌశల్ అప్పుడు ఒంటరిగా పోరాడుతున్నట్టు అందరి నుండి సానుభూతి సంపాదించడం, హౌస్ మేట్స్ అందరితో గొడవపడుతున్నట్టుగా బిగ్ బాస్ గేమ్ ని పర్ఫెక్ట్ గా ఆడడం, కౌశల్ ఆర్మీ వలన బిగ్ బాస్ విన్నర్ అవడం జరిగాయి.
ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు...
అయితే విన్నర్ గా బయటికొచ్చిన కౌశల్ చాలా స్వార్ధపరుడిగా మారాడని టాక్ వినబడుతుంది. కౌశల్ ఆర్మీ.. అది చేసే పనులను కౌశల్ సమర్ధించడం, మిగతా హౌస్ మేట్స్ తనకసలు విన్నర్ అయినా గౌరవం ఇవ్వడం లేదంటూ ఇంటర్వ్యూల్లో చెప్పడం, అలాగే తనకు సినిమా వాళ్ల నుండి సపోర్ట్ ఉందంటూ మాట్లాడడం చూస్తున్న కౌశల్ వ్యతిరేకులు కౌశల్ కి బాగా ఎక్కువైందంటున్నారు. ఇక హౌస్ లో తనని ఒంటరిని చేసిన హౌస్ మేట్స్ తో తనకెలాంటి సంబంధం లేదని.. అసలు బయటికొచ్చాక తనని ఎవరూ కాంటాక్ట్ చెయ్యలేదని... ఇలా రకరకాలుగా మాట్లాడడంతో.. బిగ్ బాస్ రన్నర్ గా నిలిచిన సింగర్ గీత మాధురి స్పందిస్తూ కౌశల్ కి ఫోన్ చేసినా రెస్పాండ్ కావడం లేదంటూ చెప్పడం చూస్తుంటే కౌశల్ ని ఏమనాలంటున్నారు గీత అభిమానులు. ఇంకా గీత కౌశల్ గురించి మాట్లాడుతూ.. కౌషల్ ఫోన్ నెంబర్ కోసం ఒకరు తనని అడగగా.. అతనికి నెంబర్ ఇవ్వొచ్చా.. లేదా అని అడగడానికి కౌశల్ కి ఫోన్ చెయ్యగా కౌశల్ స్పందించలేదని తర్వాత అయన వైఫ్ నీలిమ లైన్ లోకొచ్చారని చెప్పింది.
కౌశల్ ఆర్మీ అండతోనే...
అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మరో సెలెబ్రిటీ భాను తన పుట్టిన రోజు సందర్భంగా హౌస్ మేట్స్ అంతా కలుద్దామని కౌశల్ కి రెండుమూడు సార్లు ఫోన్ చెయ్యగా కౌశల్ స్పందించలేదని కూడా గీత మాధురి చెబుతున్న మాట. హౌస్ లో లాగానే కౌశల్ బయట కూడా బిహేవ్ చెయ్యడంపై మాత్రం కొంతమంది కౌంటర్లు వేస్తున్నారు. విన్నర్ గా బయటికొచ్చిన కౌశల్ కి విజయ గర్వం నెత్తికెక్కిందని.. సినిమాల్లో హీరోగా, విలన్ గా బాగా బిజీ అవుతానని కాన్ఫిడెన్స్ ఉండబట్టే కౌశల్ ఇలా మాట్లాడుతున్నాడంటున్నారు. ఏది ఏమైనా కౌశల్ తన ఆర్మీ అండ చూసుకుని ఇలా మాట్లాడుతున్నాడంటున్నారు.