'వినయ విధేయ రామ' ను చిరు చేతుల్లోకి తీసుకున్నాడా?

Update: 2018-11-16 05:10 GMT

మాస్ హీరోగా పిలుచుకునే రామ్ చరణ్..మాస్ డైరెక్టర్ గా పిలువబడే బోయపాటి శ్రీను వీరిద్దరి కాంబినేషన్ లో ఓ పక్క మాస్ కమర్షియల్ సినిమా మన ముందుకు రానుంది. 'వినయ విధేయ రామ' అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది.

చరణ్ సరసన కైరా అద్వాని నటిస్తున్న ఈసినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానునున్నారు మేకర్స్. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. త్వరలోనే మిగిలిన రెండు పాటలు కూడా షూట్ చేయనున్నారు. బోయపాటి 3 గంటలకి పైగా నిడివి కలిగిన రఫ్ కట్ రెడీ చేశాడట. దాన్ని మెగాస్టార్ చిరంజీవికి చూపించే ప్రయత్నం చేస్తున్నారట.

చిరంజీవి మంచి ఎడిటర్ అని అందరికి తెలిసిన విషయమే. తన సినిమాలే కాదు తన కొడుకు సినిమాలని కూడా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కట్ చేపిస్తుంటాడు. కథ వేగంగా .. బిగువుగా నడవడానికి అడ్డుపడే సీన్స్ ను ఆయన లేపేస్తుంటారు. బోయపాటి రెడీ చేసిన మూడు గంటల వెర్షన్ లో చిరు ఒక అరగంట నిడివినైనా తగ్గించనున్నాడు. సో మరి అందులో ఎటువంటి సీన్స్ ఎడిట్ అవ్వనున్నాయో చూడాలి. చిరు కత్తిరింపులో ఎన్ని సీన్స్ ఎగిరిపోనున్నాయో..

Similar News