తెలుగు తెరకు 'ఒక మనసు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెగా కూతురు నిహారిక తన మొదటి సినిమాతోనే నిరాశపరిచింది. ఆ తరువాత వచ్చిన 'హ్యాపీ వెడ్డింగ్' తో డిజాస్టర్ అందుకున్న ఈమె తమిళంలో ఒక సినిమా చేసింది. వరస ప్లాప్స్ వచ్చిన ఈమెకు తెలుగులో అవకాశాలు మాత్రం తగ్గలేదు.
లేటెస్ట్ గా నిహారిక ఓ సినిమాతో మన ముందుకు రానుంది. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఈసినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని తెలుస్తుంది. గప్ చుప్‌గా ఈసినిమా తీసేసారు. దీనికి ప్రణీత్ దర్శకత్వం వహించాడు. ప్రణీత్ అంటే ఎవరో కాదు నిహారికతో 'ముద్దపప్పు ఆవకాయ్' అనే వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్. ఇతను ఈసినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నాడు.
నిహారిక సరసన రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈసినిమాకు 'సూరేకాంతం' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇందులో నిహారిక పేరు సూరేకాంతం అంట ఆమె ఆ పేరుతో పడే తిప్పలతో ఈ సినిమా సరదాగా సాగుతుందని అందుకే టైటిల్ 'సూరేకాంతం' అని పెట్టాం అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేయనున్నారు