నిహారికకు మెగా బ్లెస్సింగ్స్

మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ లోని ఉదయపూర్ కి స్పెషల్ ఫ్లైట్స్ ఏసుకుని పెళ్లి మండపానికి [more]

Update: 2020-12-08 07:44 GMT

మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ లోని ఉదయపూర్ కి స్పెషల్ ఫ్లైట్స్ ఏసుకుని పెళ్లి మండపానికి దిగిపోయారు. రేపు రాత్రి జరగబోయే పెళ్లి కోసం ఇప్పటికే మెగా ఫ్యామిలిలో చిరంజీవి సహా ఆయన భార్య సురేఖ, రాంచరణ్, ఉపాసన, అల్లు ఫామిలీ, సాయి ధరమ్ ఫామిలీస్ అందరూ రాజస్థాన్ కి వెళ్లిపోయారు. అక్కడ గత రాత్రి జరిగిన నిహారిక సంగీత్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టేజ్ డాన్స్ హైలెట్ అవగా, నిహారిక – చైతన్య డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక చిరంజీవి తన ముద్దుల చిన్నారి నిహారికకు కోట్లు విలువ చేసే బహుమతులను ఇవ్వడమే కాదు… పెళ్లి అవ్వకముందే నిహారిక అప్పగింతలు చేసేసాడు.

రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు బ్రదర్స్, దర్శకుడు మెహెర్ రమేష్ లు నిహారిక సంగీత్ వేడుకలో డాన్స్ తో ఉర్రుతలూగించారు. ఇక తాజాగా చిరంజీవి తనకు నిహారికకు ఎలాంటి అనుబంధం ఉందొ చెప్పడానికి.. అలాగే నిహారికకు మెగా బ్లెస్సింగ్ ఇవ్వడానికి ఓ అద్భుతమైన ట్వీట్ చేసాడు. చిన్నప్పుడు నిహారికను ఎత్తుకున్న ఫోటో తో పాటుగా.. నిహారిక పెళ్లి కూతురుని చేసినప్పుడు చిరు తో సెల్ఫీ దిగిన అరుదైన ఫొటోస్ ని పోస్ట్ చెయ్యడమే కాదు.. మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. God bless you! అంటూ నిహారికాని చైతన్య చేతిలో పెట్టి అప్పగింతలు చేసేసాడు

Tags:    

Similar News