మెగా డాటర్ నిహారిక కొణిదెల - సమంత అశ్విన్ జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ వెడ్డింగ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్దమవుతుండగా... ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ లో నిహారిక కొణిదెల మంచి డ్రెస్ సెన్స్ తో చాలా అందంగా... ఆకర్షించేలా కనబడుతుంది. ఇక ఈ సినిమా పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా దర్శకుడు లక్ష్మణ్ కార్య మలిచాడనిపిస్తుంది. పెళ్లి కుదిరిన రోజు నుండి పెళ్లి జరిగే వరకు రెండు కుటుంబాల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని అందంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పెద్దల నిశ్చయంతో కుదిరిన పెళ్ళి... ఆ పెళ్ళికి సంబందించిన పనులు, పెళ్లి కుదిరిన తర్వాత అమ్మాయి పడే మానసిక వేదన, అలాగే అబ్బాయిలకుండే కష్టాలు అన్ని ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు.
మురళి శర్మ, సీనియర్ నరేష్, ఇంద్రజ వంటి సీనియర్ నటీనటులతో ఈ సినిమా భారీ హంగులతో భారీగా కనబడుతుంది. ఇక ఈసినిమాలో నిహారిక చెప్పే డైలాగ్స్ ఎమోషనల్ గా హత్తుకున్నాయి. పెళ్లి చేసుకుని మరొకరి ఇంటికి కోడలిగా... ఒకరికి భార్య గా వెళ్లేముందు ఆమె పడే మానసిక వేదనను అబ్బాయితో పంచుకుంటే... దానికి ఆ అబ్బాయి కూడా మాకు ఉంటాయి కష్టాలు అంటూ చెప్పడం.. ఇక నిహారిక కేరెక్టర్ కాస్త పోర్ష్ గా పబ్ లో మందు తాగెయ్యడం, ఇక సుశాంత్ తో వైన్ అనుకుని వోడ్కా తాగడం అనెయ్యడం వంటి డైలాగ్స్ బావున్నాయి. అయితే హ్యాపీ వెడ్డింగ్ లో హ్యాపీనెస్ మాత్రమే కాదు... కొన్ని బాధలు కూడా ఉంటాయండి అనిపించేలా హ్యాపీ వెడ్డింగ్ ట్రయిలర్ ఉంది. ఇక అబ్బాయి, అమ్మాయి తండ్రులుగా నరేష్ అండ్ మురళి శర్మలు మరోసారి అదరగొట్టేసాలాగే కనబడుతున్నారు.