మిర్చి సినిమాలో పగను పగతో కాదు... ప్రేమతో గెలవాలనే మెసేజ్ ఇచ్చాడు దర్శకుడు కొరటాల శివ. శ్రీమంతుడు సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకుని.... అందరికి ఆదర్శవంతమైన సినిమా చేసి చూపెట్టాడు. ఇక జనతా గ్యారేజ్ లో మొక్కలను పెంచడం పర్యావరణానికి ముఖ్యమన్నాడు. ఇక భరత్ అనే నేను లో సీఎం గా ప్రజలకు ఎలా చేరువవ్వాలో.. ఎవరికి ఎలాంటి పనులు చెయ్యాలో చూపెట్టాడు. మరి నాలుగు సినిమాల్తో కొరటాల సూపర్ హిట్స్ కొట్టాడు.
చిరుకు కమిట్ అయిన తర్వాత.....
మహేష్ తో భరత్ అనే నేను తో సినిమా తర్వాత కొరటాల మెగాస్టార్బ్ చిరు కి కమిట్ అవడం... చిరంజీవి కోసం కథ తయారు చెయ్యడం చేస్తున్నాడు కొరటాల. అధికారికంగా కొరటాల - చిరు సినిమా ప్రకటన రాకపోయినా... ఆ కాంబో సెట్ అయినట్లే అంటున్నారు. ఇక ప్రస్తుతం చిరు సై రా నరసింహారెడ్డి సినిమా పూర్తయిన వెంటనే కొరటాల మూవీ కి షిఫ్ట్ అవుతాడట. ఈలోపు కొరటాల కథ, స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తాడట.
రైతు పాత్రలో......
అయితే కొరటాల శివ.. చిరు కోసం మళ్ళీ మెసేజ్ ఓరియెంటెడ్ కథనే రెడీ చేస్తున్నట్లుగా ప్రచారం మొదలవుతుంది. మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రైతు పాత్రలో నటించనున్నాడని అంటున్నారు. సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర ద్వారా నేటి రైతు పరిస్థితులకు సమస్యలకు సరైన పరిష్కారం కొరటాల ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాడట. ఇక చిరు కోసం తమన్నా ని హీరోయిన్ గా తీసుకోవాలనే యోచనలో కొరటాల ఉన్నట్లుగా కూడా వార్తలొస్తున్నాయి.