దసరా నాటికి ప్రభాస్ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి కామెంట్స్..
వచ్చే దసరా నాటికి ప్రభాస్ పెళ్లి. దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఇంటరెస్టింగ్ కామెంట్స్.
రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనే ప్రశ్న.. ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిపోయింది. ఈ మ్యారేజ్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు టాలీవుడ్ లోని చాలా మంది ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. వీరంతా ఎంతలా ఎదురు చూస్తున్నారంటే.. ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదని, AI టెక్నాలజీతో ప్రభాస్ కి పెళ్లి చేసి, ఆ ఫోటోలు చూస్తూ సంబర పడుతున్నారు. ఇటీవల ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
ఇది ఇలా ఉంటే, తాజాగా ప్రభాస్ పెద్దమ్మ, దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి.. ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు శ్యామలాదేవి వచ్చారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని, వచ్చే దసరా నాటికీ పెళ్లి జరిగిపోతుందని' పేర్కొన్నారు.
కృష్ణంరాజు తమతో లేకపోయినా తమ కుటుంబసభ్యులు ఆయన పేరుని నిలబెడుతూ ముందుకు వెళ్తున్నారంటూ ఆమె పేర్కొన్నారు. ఇక వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఒక ఇంటివాడు అయ్యి మీకు కనిపిస్తాడని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. అయితే అమ్మాయి ఎవరు..? పెళ్లి తేదీ ఎప్పుడు అనేది..? మాత్రం త్వరలోనే స్పష్టం చేస్తామని వెల్లడించారు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా అభిమానులంతా ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకుంటారు. ఈక్రమంలోనే ఇటీవల AI టెక్నాలజీతో ప్రభాస్, అనుష్కకి పెళ్లి చేసి, వారిద్దరికీ ఒక పాపని కూడా పుట్టించేశారు. కాగా ప్రభాస్ అండ్ అనుష్క మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే. అనుష్క కూడా ప్రభాస్ కుటుంబసభ్యులతో చాలా సాన్నిహిత్యంగా ఉంటుంది. కృష్ణంరాజు మరణించే సమయంలో కూడా అనుష్క ఆయన దగ్గరే ఉంది. మరి ప్రభాస్ పెళ్లాడే ఆ అమ్మాయి ఎవరో తెలియాలంటే కొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే.