ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీశాడు ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు. 90లలో చిరుతో బ్రేక్ వచ్చాక 'చంటి' వంటి సూపర్ హిట్ చిత్రం నిర్మించాడు. ఆ తర్వాత నుండి ఆయన బ్యానర్ లో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు రాలేదు. వరస ఫ్లాపులు ఆయన్ని బాగా దెబ్బ తీశాయి. దాంతో ఆయన సినిమాలు ఆపేసి సైలెంట్ అయిపోయాడు. మళ్లీ ఇప్పుడు లేటెస్ట్ గా కొంచం పుంజుకుని ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాతో ఆయన రీఎంట్రీ ఇచ్చారు.
చరణ్ తో సినిమా అన్న చిరు
సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు కానీ.. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో రామారావు ఖాతాలో మరో ఫ్లాప్‌ను జమ చేసింది. అయితే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. రామారావుతో చరణ్ ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారంగా ప్రకటించాడు. కానీ చరణ్ తో రామారావు సినిమా చేయాలంటే కనీసం రెండేళ్లు ఆగాల్సిందే.
అప్పటి వరకు ఖాళీగా ఉండలేక...
ప్రస్తుతం బోయపాటి సినిమా చేస్తున్న చరణ్.. ఆ తర్వాత రాజమౌళి మల్టీస్టారర్లోకి వెళ్లిపోతాడు. రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా 2019 చివరి వరకు ఆగక తప్పదు. అప్పటివరకు రామారావు ఖాళీగా ఉండలేడు. ఈలోపు ఆయన నాని హీరోగా ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నానితో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి మరోసారి నానిను డైరెక్ట్ చేయనున్నాడు. అయితే ఈ చిత్రంపై ఇంకా అధికార ప్రకటన రాలేదు. వచ్చే ఏడాది స్టార్టింగ్ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లొచ్చు అంటున్నారు.