లక్ష్మీరాయ్ అప్పుడే అమ్మమ్మ అయ్యింది. ఏంటీ.. నమ్మడం లేదా..? 31 ఏళ్లకే అమ్మమ్మ కావడం ఏంటనుకుంటున్నారా..? నిజమే.. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అంతేకాదు, తన కుటుంబం పెద్దదైందని కూడా రాసింది. అయితే, లక్ష్మీరాయ్ కి పుట్టింది మనుమడో, మనుమరాలో కాదు, తన పెంపుడు కుక్కకు రెండు పిల్లలు పుట్టాయి. దీనికే లక్ష్మీరాయ్ తెగ సంబరపడిపోతోంది. ‘నా వయస్సు వారంతా అద్భుతమైన అమ్మలుగా మారుతోంటే... నేను మాత్రం ఈ కవలలకు అమ్మమ్మను అయ్యాను.’ అంటూ కుక్క పిల్లలను ముద్దాడుతూ ఉన్న ఫోటోలను ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేసింది. ప్రస్తుతం లక్ష్మీరాయ్ తమిళ, మళయాలం సినిమాలతో బిజీగా ఉంది.
While most girls at my age turn into wonderful mothers .. here I am, already a proud grandmother to these twins.. ☆♡☆.🤪😛😘 Blessed to have the cutest babies from my babies #Miu #Lui #myworld introducing #tiffany #paco we r a big family now 😬💋#happyme #happymotherhood 💋💖 pic.twitter.com/u97YzbuRq1
— RAAI LAXMI (@iamlakshmirai) July 10, 2018