ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. లావణ్య ఏ సినిమాలో నటించినా.. అన్ని సినిమాలు ప్లాపులే. యావరేజ్ అయిన సినిమాలకి లావణ్య కి మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలేవీ లేవు. ట్రెడిషన్ పాత్రలు వలన హిట్ పడడం లేదనుకుంటే.... కనీసం క్లాస్ అండ్ గ్లామర్ పాత్రలు అమ్మడుకి మంచి చెయ్యడం లేదు. భలే భలే మగాడివోయ్ సినిమా హిట్ అయినా... ఆ సినిమా హిట్ క్రెడిట్ మొత్తం నాని, దర్శకుడు మారుతీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. తాజాగా అంతరిక్షం సినిమాలో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ సరసన నటించింది. ఆ సినిమా కొంతమంది బావుందని.. మరికొంతమంది యావరేజ్ అంటున్నారు. అసలా సినిమా మల్టిప్లెక్స్ ఆడియన్స్ కోసం తీసినట్లుగా ఉంది. కలెక్షన్స్ రావడం కష్టమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
యావరేజ్ రేటింగ్స్....
క్రిటిక్స్ కూడా ఎవరికీ నచ్చినట్టుగా, అంటే హిట్ రేటింగ్స్ కొంతమంది, యావరేజ్ రేటింగ్స్ కొంతమంది ఇస్తున్నారు. అలాగే సినిమాలో వరుణ్ తేజ్ నటనకు పేరొచ్చినట్టుగా అందులో నటించిన లావణ్యకి గాని, అదితి రావు కి గారి మంచి పేరు రాలేదు. అసలు హీరోయిన్స్ పరంగా క్రిటిక్స్ కానీ, ప్రేక్షకులు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హీరోయిన్ కు అంతగా ప్రాధాన్యత లేదని గుర్తించే లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు కాబోలు అన్నట్టుగా ఉంది సినిమాలో లావణ్య పరిస్థితి. ఉన్నకాసేపు చేయాల్సింది చేసి తప్పుకుంది. వరుణ్ కు జోడిగా కుదిరిందా లేదా అనే ఆలోచన వచ్చే అవకాశం లేకుండా చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రని లావణ్య త్రిపాఠికి ఇచ్చాడు సంకల్ప్. అయితే లావణ్య, అదితి రావు పాత్రలు గ్లామర్ కోసమో, హీరోయిన్లు ఉండాలనో పెట్టినవి కావు.
ఒరిగిందేమీ లేదా?
ఆయా పాత్రలకు ఎప్పుడైతే వెయిటేజీ ఉంటుందో.. అప్పుడు ఆ పాత్రలు రాణిస్తాయి. వీరిద్దరి విషయంలోనూ అదే జరిగింది అనే అభిప్రాయాలను కొందరు లేవనెత్తుతున్నారు. ఏది ఏమైనా అంతరిక్షం తో లావణ్యకి ఒరిగింది లేదు. తరిగింది లేదు అన్నట్టుగా ఉంది వ్యవహారం. మరి నిఖిల్ తో నటించిన ముద్ర అయినా లావణ్య ని కాపాడుతుందో లేదో అనేది తెలియాలి. అయితే ముద్ర సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో అనేది క్లారిటీ లేని ప్రశ్న. ఎందుకంటే విడుదల పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇంకా విడుదలకు డేట్ ఫిక్స్ చేసుకోలేదు.