వెయ్యి కొట్ల భారీ బడ్జెట్ తో వీఏ శ్రీకుమార్ మీనన్ డైరెక్షన్ లో దేశంలోని పలు భాషల్లో మహాభారత మూవీ తెరకెక్కబోతున్నట్లుగా గత ఏడాది నుండి వార్తలొస్తున్నాయి. అయితే గత నాలుగైదు నెలల నుండి ఈ ప్రాజెక్ట్ మీద ఎలాంటి అప్ డేట్ లేదు. దాదాపుగా ఈ సినిమా ఆగిపోయిందనుకుంటున్న తరుణంలో తాజాగా ఈ సినిమా గురించి వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా మలయాళంలో మాత్రం రన్డామూళమ్ టైటిల్ తో తెరకెక్కుతుండగా.. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో మాత్రం ది మహాభారత టైటిల్ తో తెరకెక్కబోతున్నట్లుగా సమాచారం.
ఏ భాషలో ఆ హీరో...
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బాగా బిజీగా ఉన్న మహాభారత చిత్ర బృందం ఈ సినిమాని వచ్చే ఏడాది అంటే 2019 జులై నుండి రెగ్యులర్ షూటింగ్ కి సిద్దమవుతున్నారట. మరి ఈ సినిమా మొదలవ్వడానికే ఇంకా ఏడాది టైం ఉంది. రెండు పార్ట్ లుగా తెరకెక్కతున్న ఈ చిత్రం ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా.. తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు తమ వంతుగా కష్టపడుతున్నారట. ఇక బీఆర్ శెట్టి నిర్మించనున్న ఈ చిత్రం దాదాపుగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ హంగులతో తెరకెక్కుతుంది. ఇకపోతే 2020 టార్గెట్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని మలయాళంలో మోహన్ లాల్ హీరోగా, ఇతర భాషల్లో ఆయా భాషల స్టార్ హీరోలతో తెరకెక్కించబోతున్నారట.