ఇది కదా...మహానటి ప్రభంజనం!

Update: 2018-05-18 12:03 GMT

ఎలాంటి అంచనాలు లేకుండా మే 9న థియేటర్లలోకి దిగిన మహానటి మూవీ చిన్న, పెద్ద సినిమాలకు చుక్కలు చూపించింది. మహానటి సినిమా భారీ హిట్ అయ్యింది. ఏదో సావిత్రి జీవిత కథ ఇదేం ప్రేక్షకులకు ఎక్కుతుంది, ఎక్కితే గిక్కితే కేవలం లేడీస్ కి నచ్చడమే ఎక్కువ అని అనుకున్నారు అంతా. కానీ సినిమా విడుదలై అందరి అంచనాలు తప్పని రుజువు చేసింది. సావిత్రి కథకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మహానటి వీకెండ్స్ తో పాటు వీక్ డేస్ లోనూ థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. అలాగే ఇప్పుడు మహానటి కి సెకండ్ వీకెండ్. ఈ వీకెండ్ లోనూ మహానటి జోరు కొనసాగనుంది. ఎందుకంటే నా పేరు సూర్య, మెహబాబా థియేటర్స్ మొత్తం లేపేసి మహానటికి కేటాయించడం ఒక ఎత్తు అయితే, శుక్రవారం విడుదలైన కాశీ సినిమా అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకోవడం మహానటికి కలిసొచ్చే అంశం. ఇక మహానటి జోరుని తట్టుకోలేక ఈ వారం ఒక్క తెలుగు సినిమా థియేటర్స్ లోకి దిగలేదంటే మీరెవరన్నా నమ్ముతారా....?

అమెరికాలోనూ కొత్త రికార్డులు...

మహానటి వసూళ్లు రెండో వారాంతంలో ఊహించని విధంగా ఉంటాయని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. అందులోనూ అమెరికాలో మహానటి సెకండ్ వీకెండ్ వసూళ్ల విషయంలో కొత్త రికార్డులు నెలకొల్పుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు ధీటుగా ఓవర్సీస్ లో మహానటి కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఇక అమెరికాలో అయితే సెకండ్ వీకెండ్ కోసం స్క్రీన్లు పెంచారంటే మహానటి క్రేజ్ ఎలా ఉందొ అర్ధమవుతుంది. ఎప్పుడూ ఐటి వాళ్లు మాత్రమే సినిమాలు చూస్తూ వీకెండ్స్ ని ఎంజాయ్ చేసేవారు. కానీ ప్రస్తుతం మహానటి రాకతో నిన్నటితరం ప్రేక్షకులతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి.

బూరెల బుట్టలో పడ్డ డిస్ట్రిబ్యూటర్లు....

ఇక మహానటి తొలి వారాంతానికి దీటుగా రెండో వారాంతపు వసూళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఓవర్సీస్ లో 1.8 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. సెకండ్ వీకెండ్ అయ్యేసరికి 2.5 మిలియన్ మార్కును దాటుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. రిలీజ్ ముంగిట ఈ చిత్రంపై మరీ అంచనాలేమీ లేకపోవడంతో తక్కువ మొత్తానికే మహానటి హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ సినిమా అనేక రెట్లు లాభాలను దోసిళ్లలో పోస్తుంది.

Similar News