లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మహానటి. కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ మనసులు గెలుచుకుంది ఈ చిత్రం. సినిమా విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టినా ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యారు. నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకుడు నాగ్ అశ్విన్, హీరోయిన్ కీర్తి సురేష్, హీరో విజయ్ దేవరకొండ, రచయిత బుర్రా సాయి మాధవ్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వప్న దత్ మాట్లాడుతూ...మూడో వారం కూడా సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందని, ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ఇంకా మంచి సినిమాలు చెయ్యాలనే ఆలోచన వస్తోందని పేర్కొన్నారు. రాజేంద్ర ప్రసాద్, నాగ చైతన్య ఇలా ప్రతీ ఒక్కరూ మా సినిమా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. బుర్రా సాయి మాధవ్ మాట్లాడుతూ..ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తున్నారని, ప్రేక్షకులు న్యాయ నిర్ణేతలన్నారు. కీర్తి సురేష్ ను చూస్తుంటే సావిత్రి గారిని చూసినట్లే ఉందని అన్నారు.
ఇంకా బాధ్యతను పెంచింది...
ప్రియాంక దత్ మాట్లాడుతూ...మంచి సినిమాలు చెయ్యదానికి ప్రయత్నిస్తామని, మహానటి సినిమా మాపై భాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. సినిమాను విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ...జనాలు వచ్చి సినిమాను చూస్తారని ఆశించామని, తాను సినిమా గురించి ఏదైతే అనుకున్నానో ఆడియన్స్ అదే ఫీల్ అవుతున్నారని పేర్కొన్నారు. డైరెక్టర్ గా నాకు హ్యాపీ గా ఉందని. ఈ సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉందన్నారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ...సావిత్రి గారి లైఫ్ చూసి షాక్ అయ్యానని, వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మించడం గొప్ప విషయమన్నారు. నాగ్ అశ్విన్ సినిమాను నడిపించిన విధానం గొప్పగా ఉందన్నారు. మహానటి లాంటి సినిమాలు అరుదుగా వాస్తుంటాయని, ఎవడే సుబ్రహ్మణ్యం తరువాత నాగ్ అశ్విన్ తో చేసిన సినిమా మహానటి అని, నాగ్ అశ్విన్ హాడ్ వర్క్ ను దగ్గరుండి చూసానని పేర్కొన్నారు. హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ...తనను సపోర్ట్ చేస్తున్న మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్ నాగి, స్వప్న, ప్రియాంక తనకు అందించిన సహకారం మరువలేనిదని, సాంకేతిక నిపుణులందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారామె. వారి సహకారం మరువలేనిదని, అందరూ కష్టపడ్డారు కాబట్టే సినిమా విజయం సాధించిందని పేర్కొన్నారు. ఈ సక్సెస్ ను తాను మర్చిపోలేనన్నారు.