కాఫీ కి పిలిచింది కదా అని.. లైఫ్ ని రిస్క్ చెయ్యలేం కదా..!

మహర్షి సినిమా మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ అనగానే కాస్త హైప్ పెరిగింది. ఇక ఆ ఈవెంట్ కి వెంకటేష్, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హాజరవడం [more]

Update: 2019-05-02 06:26 GMT

మహర్షి సినిమా మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ అనగానే కాస్త హైప్ పెరిగింది. ఇక ఆ ఈవెంట్ కి వెంకటేష్, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హాజరవడం మహేష్ అభిమానులకు ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఇక మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే మహర్షి ట్రైలర్ ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం. మహర్షి ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమాతో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనబడుతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా, అల్లరి నరేష్ మహేష్ ఫ్రెండ్ గా నటించిన ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయాడు. ఇక మహర్షి ట్రైలర్ లోకి వెళితే… ఏం సాధిద్దాం అనుకుంటున్నావు రిషి అని రావు రమేష్.. మహేష్ ని ఉద్దేశించి అడిగితే… మహేష్ మాత్రం ఏలేద్దామనుకున్నా సర్ అంటూ మొదలెడతాడు. ఏంటి అని రావు రమేష్ ఆశ్చర్యపోతే.. ప్రపంచాన్ని ఏలేద్దామనుకున్నాను అంటూ కాన్ఫిడెంట్ తో మహేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. సక్సెస్ కి ఒక ఎగ్సాంపుల్ గా మారిన మీ గురించి తెలుసుకోవాలని మాకందరికి ఉంది.. సక్సెస్ ఎక్కడుంది అని ఝాన్సీ అడుగుతుంది.

ఆకట్టుకున్న డైలాగ్స్

గతం, మనందరికీ గతం ఉంది మనం గతంలో ఎక్కడున్నాం, ఇప్పుడెక్కడున్నాం, దాన్ని బట్టి మనకర్ధమైపోతుంది… వెథర్ వి అర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్…. అంటూ కూల్ గా చెప్పే డైలాగ్, ఇక స్కూటర్ మీద వెన్నెల కిషోర్ ని ఎక్కించుకుని కాలేజ్ కి వస్తూ హీరోయిన్ పూజ హెగ్డే.. రిషి కాఫీ తాగడానికి వాస్తవా అంటే… అమ్మాయి కాఫీ కి పిలిచింది కదా అని.. లైఫ్ ని రిస్క్ లో పెట్టలేం అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక అల్లరి నరేష్, మహేష్ ని ఫ్రెండ్ గా అనుకోవడం.. మహేష్, పూజాతో కలిసి ఫ్రెండ్షిప్ చెయ్యడం ఇవన్నీ వంశీ పైడిపల్లి అందంగా చూపించాడు. ఇక జగపతి బాబు ఇప్పటివరకు నీకు గెలవడమే అలవాటనుకుంటా.. ఇప్పటి నుండి ఓడిపోవడం కూడా అలవాటు చేసుకో అంటూ మహేష్ ని రెచ్చగొడితే… దానికి మహేష్ మాత్రం చాలా కూల్ గా చిన్నప్పుడెప్పుడో మా అమ్మకు చెప్పాను.. మళ్లీ ఇప్పుడు నీకే చెప్పడం.. ఓడిపోవడం అంటే నాకు భయం, ఆ భయంతోనే ఇక్కడిదాకా వచ్చాను. మళ్లీ ఆ భయాన్ని నాకు పరిచయం చేసింది అంటూ మహేష్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అదుర్స్ అన్న రేంజ్ లో ఉంది.

స్టైలిష్ లుక్ లో మహేష్

ఇక మహేష్ మాత్రం అన్ని సీన్లలో చాలా స్టైలిష్ గా కనిపించాడు. సూటు బూటులోనే కాదు.. ప్యాంట్ షర్ట్ లోనూ నాగలి పట్టిన మహేష్ అదరగొట్టాడు. ఇక పూజా హెగ్డే గ్లామర్ గా ఆకట్టుకుంది. అల్లరి నరేష్ మాత్రం మహేష్ కి, పూజాకి ఫ్రెండ్ గా చాలా సాదాసీదాగా నటనతో ఆకట్టుకున్నాడు. మోహనన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక దేవిశ్రీ సంగీతం ఓకె ఓకె కానీ.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.

Tags:    

Similar News