మహర్షి స్టోరీ ఇదే

సూపర్ స్టార్ట్ మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘మహర్షి’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ [more]

Update: 2019-01-10 05:00 GMT

సూపర్ స్టార్ట్ మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘మహర్షి’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అవుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మహేష్ ఫ్యాన్స్. ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు రీసెంట్ గా వదిలిన మహేష్ స్టిల్ ఈసినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ఇందులో మహేష్ అమెరికా కంపెనీ సీఈఓ గా ఇండియాలో రైతు సమస్యలు తీర్చే వ్యక్తి గా నటిస్తున్నాడు.

అయితే గత కొన్ని రోజులు నుండి ఈసినిమా కథ ఇదే అని ప్రచారం జరుగుతుంది. ఇండియా మొదటి నుండీ వ్యవసాయ ఆధార దేశమైనప్పటికీ.. పరిస్దితులు బాగోకపోవడంతో రైతులకి సరైన గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా సహకరించక, వ్యవసాయం దండగ అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు రైతులు . దీనికి అంతటా కారణం రైతుకి సరైన గిట్టుబాటు ధర రాకపోవడమే.

ఇందులో ఈ ప్రాబ్లమ్స్ ని చూపించి రైతు కు ఏవిధంగా పరిష్కారం చూపించాలనేది ఈసినిమా లో చూపించనున్నారు. అంతే కాదు ఆధునిక పద్దతులతో వ్యవసాయం చేస్తే…అది దండగ కాదని… వ్యవసాయం పండగ… అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కథ ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. ఇటివంటి పాయింట్స్ తో మహేష్ ఆల్రెడీ నటిస్తున్నప్పటికీ ఇందులో మహేష్ రెండు షేడ్స్ లో కనిపిస్తున్నాడు కాబట్టి సినిమా హిట్ అవ్వడం కాయం అని అంటున్నారు. త్వరలోనే హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

Tags:    

Similar News