మహేష్ బాబు - వంశీ పైడిపల్లిల సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎట్టకేలకు డెహ్రాడూన్ లో మొదలైంది. పివిపి తో సమస్యల వలన సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టడానికి రెండు వారాల పాటు లేట్ అవడంతో... ఇప్పుడు మహేష్ 25 మూవీ షూటింగ్ ని మొదలెట్టేసి చకచకా పూర్తి చేసేయాలని వంశీ పైడిపల్లి కంకణం కట్టుకున్నాడు. నిర్మాత పీవీపీ తో చెయ్యాల్సిన వంశీ పైడిపల్లి, మహేష్ మూవీ... దిల్ రాజు నిర్మాణంలో చేపట్టడంతో మొదలైన గొడవలు... కోర్టు కేసులు అంటూ ఇంకా ఇరకాటంలోనే ఉంది. కోర్టు బయట దిల్ రాజు బ్యాచ్ పీవీపీ తో సెటిల్మెంట్ చేసుకుందామనుకుంటే అది కుదరకపోయేసరికి... ఇంకా కోర్టు కేసులంటూ కూర్చుంటే.. సమయం వృధా అవుతుందననుకున్నారో.. లేదంటే కోర్టు కేసులతో మనకేంటి అనుకున్నారో.... మహేష్ - వంశీ పైడిపల్లి లు పూర్తి స్క్రిప్ట్ తో సెట్స్ మీదకెళ్లిపోయారు.
మహేశ్ లుక్ ఇదేనా...
ప్రస్తుతం షూటిగ్ నిమిత్తం చిత్ర బృందం మొత్తం డెహ్రాడూన్ లో ల్యాండ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో మహేష్ కొత్తగా లుక్ లో కనిపిస్తాడు... ఇందు కోసమే గెడ్డం, మీసం, హెయిర్ స్టయిల్లో మార్పులు చేర్పులు కూడా చేసాడు మహేష్ బాబు. సమ్మోహనం ఆడియో లాంచ్ అప్పుడు మహేష్ బాబు రఫ్ గా గెడ్డం లుక్ తో పాటు పాపిడి పక్కకి తీసి న్యూ హెయిర్ స్టైల్ లో కనిపించాడు. దాదాపుగా ఈ మూవీకి మహేష్ లుక్ అదే. ఎందుకంటే డెహ్రడూన్ షూటింగ్ లొకేషన్ నుండి లీకైన ఒక పిక్ లో మహేష్ బాబు సమ్మోహనం లుక్ అంటే సేమ్ అప్పటి లుక్ లో కాస్త రఫ్ గా కనబడుతున్నాడు. ఇందులో మాస్ లుక్ లో మహేష్ ఇరగదీస్తున్నాడు. పిక్చర్ పూర్తిగా క్లారిటీ లేదుగాని.. లేదంటే మహేష్ లుక్ దాదాపుగా రివీల్ అయ్యేది.
సంక్రాంతికి రిలీజ్ చేసేలా...
ఇక డెహ్రాడున్ లో మహేష్ బాబు హీరోయిన్ పూజ హెగ్డేల మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటుగా... ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్ మీద కూడా కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తారని తెలుస్తోంది. మరి ఇప్పటికే అల్లరి నరేష్ ఈ సినిమా కోసం డెహ్రాడూన్ చేరుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుని.. వచ్చే సంక్రాతి బరిలో దించే యోచనలో వంశీ, మహేష్ బాబు తో పాటుగా సంక్రాతి సెంటిమెంట్ ఉన్న దిల్ రాజు ఉన్నాడు.