మహేష్ కి ఈ లుక్ సెట్ అవుతుందా...?

Update: 2018-06-11 07:51 GMT

మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కబోయే మహేష్ 25వ మూవీ కోసం మహేష్ కొత్త లుక్ లో కనబడతాడని... మొన్న ముంబై ఎయిర్ పోర్ట్ లో మహేష్ గెడ్డం లుక్కే మహేష్ న్యూ లుక్ అంటూ ప్రచారం జరిగింది. కాకపోతే ఆ ఎయిర్ పోర్ట్ పిక్ లో మహేష్ బాబు తలకి టోపీ పెట్టుకోవడంతో అతని ఎయిర్ స్టైల్ తెలియలేదు గాని..గెడ్డం మాత్రం బాగానే కనబడింది. అయితే తాజాగా మహేష్ లుక్ రివీల్ అయినట్లే కనబడుతుంది. ఆయన తాజాగా తన బావ సుధీర్ బాబు నటించిన సమ్మోహనం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ ఈవెంట్ లో మహేష్ లుక్ మాములుగా లేదు. కొత్త మహేష్ ని చూస్తున్నామా అనే ఫీలింగ్ తెప్పించాడు మహేష్ బాబు.

25 ఏళ్ల కుర్రాడిలా...

మహేష్ బాబు కొత్తగా గెడ్డం పెంచడమే కాదండోయ్... హెయిర్ స్టయిల్లో కూడా మార్పులు చేసాడు. ఎప్పుడూ చిన్నగా కట్ చేసుకుని స్ట్రయిట్ హెయిర్ స్టయిల్ నే ఫాలో అయ్యే మహేష్ ఇప్పుడు కొత్త లుక్ లో పాపిడి తీసి జుట్టుని పక్కకి దువ్వాడు. మరి మహేష్ బాబు గెడ్డం తో పాటుగా.. జుట్టు పక్కకి దువ్వుకుని కొత్త గా కనిపిస్తున్నాడు. ఇక గెడ్డం, సైడ్ పాపిడి, గళ్ళ చొక్కా వెరసి ఈ వయసులోనూ మహేష్ బాబు ఇంకా 25 ఏళ్లు కూడా నిండని కుర్రాడిలా అదరగొడుతున్నాడు. కానీ ఈ లుక్ మహేష్ సినిమా సెట్ అవుతుందా అనేది కాస్త అనుమానమే. గెడ్డం వరకు ఒకే కానీ.. హెయిర్ స్టయిల్ మాత్రం అంతగా నప్పినట్టుగా అనిపించడం లేదు. మహేష్ బాబు గెడ్డంతో, సైడ్ పాపిడితో కొత్తగా కొంగొత్తగానే ఉన్నాడు. కానీ అదే లుక్ తో మహేష్ తన కొత్త సినిమాలో కనిపిస్తాడా... ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు.వంశీ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ సినిమా లో మహేష్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా కనిపిస్తాడని... అల్లరి నరేష్ తో స్నేహం చేసే పాత్రలో మహేష్ ఉంటాడనే ప్రచారం జరుగుతుంది. ఇక మహేష్ సరసన మొదటిసారి పూజ హెగ్డే జోడి కడుతున్న ఈ సినిమా కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Similar News