ఒకటి రెండు కాదు.. పొలోమంటున్నాయి!!

ఈ దసరాకి విడుదల కావల్సిన సినిమాలన్ని ఓటిటి లో విడుదలైపోతున్నాయి. మార్చి నుండి ఇప్పటివరకు విడుదల కావల్సిన చాలా సినిమాలు ఓటిటిలో విడుదల కాగా రామ్ లాంటి [more]

Update: 2020-10-26 05:57 GMT

ఈ దసరాకి విడుదల కావల్సిన సినిమాలన్ని ఓటిటి లో విడుదలైపోతున్నాయి. మార్చి నుండి ఇప్పటివరకు విడుదల కావల్సిన చాలా సినిమాలు ఓటిటిలో విడుదల కాగా రామ్ లాంటి వాళ్ళు థియేటర్స్ కోసం వేచి చూస్తున్నారు. చాలామంది షూటింగ్స్ కంప్లీట్ అయినా సినిమాలు కూడా థియేటర్స్ తెరచుకున్నా సినిమాలు విడుదల చేయడం లేదు. దసరా థియేటర్స్ కళకళలన్నీ బోసిపోయాయి. బాక్సాఫీసు నీరసపడిపోయింది. అయితే దసరాకి ఫస్ట్ లుక్స్ తో టీజర్స్ తో హడావిడి చేసిన స్టార్స్ చాలామంది తమ సినిమాలన్నీ సంక్రాతి  బరిలో నిలుపుతున్నట్టుగా ప్రకటించి షాకిచ్చ్చారు. 

దసరా, సంక్రాతి పండగలు సినిమాలకి పెద్ద ప్లాట్ ఫారం. అలాంటిది దసరా కరొనకి దొరికిపోగా.. హీరోలంతా సంక్రాతి మీదే అసలు పెట్టుకున్నారు. అందరి కన్నా ముందే రానా అరణ్య సినిమాని సంక్రాంతికి విడుదల అని అనౌన్స్ చెయ్యగా.. దసరా రోజున రవితేజ క్రాక్ ని సంక్రాంతికి విడుదల చెయ్యబోతున్నట్టుగా ప్రకటించాడు. అంతేనా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా సంక్రాంతే. ఇక మార్చ్ లో విడుదల కావల్సిన రామ్ రెడ్ ఓటిటికి దొరక్కుండా సంక్రాంతికి కచ్చిఫ్ వేసేశాడు. ఇక నితిన్ కూడా రంగ్ దే ని సంక్రాతి అని ఎప్పుడో చెప్పాడు. మరి ఇన్ని సినిమాలు సంక్రాంతికి అంటుంటే.. మిగతా సినిమాలు సంక్రాంతికి విడుదల అంటే థియేటర్స్ దొరకవేమో.. అందులోబు కన్నడ కెజిఎఫ్ కూడా సంక్రాంతికే అంటున్నారు. మరి ఎప్పుడూ భారీ బడ్జెట్ సినిమాల్తో సంక్రాంతికి బాక్సాఫీసు షెకాడేది. కానీ ఈసారి భారీ లేదు.. చిన్న లేదు,… మీడియం లేదు అన్ని కలగలుపు. అయితే సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు ఎన్ని అనేది డిసెంబర్ ల కల్లా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

Tags:    

Similar News