రాజమౌళి కుమారుడు కార్తికేయ నిశ్చితార్థం గత సెప్టెంబర్ లో జగపతిబాబు అన్న కూతరు పూజాతో జరిగిన సంగతి తెలిసిందే. సింగర్ గా పేరు తెచ్చుకున్న పూజా అలానే తన తండ్రి వ్యవహారాలు చూసుకుంటున్న కార్తికేయ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహంకు సిద్ధమయ్యారు. వీరి నిశ్చితార్థం చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, సెలబ్రెటీలు, స్నేహితుల సమక్షంలో జరిగింది. అయితే పెళ్లికి మాత్రం టాలీవుడ్ మొత్తం అటెండ్ అయ్యేలా చూసుకుంటున్నారు జక్కన్న.
అంగరంగ వైభవంగా
వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. జనవరి 5 , 2019 న వీరి వివాహాన్ని రామానాయుడు స్టూడియోలో నిర్వహించబోతున్నారు. పెళ్లికి సంబంధించి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం #RRR సెట్ వేయడంలో బిజీగా ఉన్న రాజమౌళి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నారు. టాలీవుడ్ సెలెబ్రెటీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్య రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించబోతున్నారు.