అడుగుపెట్టగానే లైంగిక వేధింపులా!!

Update: 2018-10-19 06:35 GMT

ఇండియా మొత్తం ప్రస్తుతం హాట్ టాపిక్ 'మీటూ'. బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిపారు. టాలీవుడ్ లో కూడా ఇలా రోజుకి ఒక్కరు బయటికి వచ్చి మేము కూడా లైంగిక వేధింపులు ఎదుర్నొన్నామని చెబుతున్నారు. రీసెంట్ గా మంచు లక్ష్మి కూడా లైంగిక వేధింపులకు గురైనట్టు వెల్లడించింది. తాజాగా ఈ లిస్ట్ లోకి హాట్ భామ పాయల్ రాజ్ పుత్ చేరింది.

కాస్టింగ్ కౌచ్ నిజమేనంటూ.....

ఇటీవల 'ఆర్ఎక్స్ 100' లాంటి సూపర్ హిట్ చిత్రంతో కుర్రకారును మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ 'మీటూ' ఉద్యమంపై స్పందిస్తూ, టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ నిజమేనని అంగీకరించింది. నటిగా నిరూపించుకున్న తర్వాత కూడా ఆ భూతం వీడలేదని చెబుతుంది. ఓ ఇంటర్వ్యూ ఆమె మాట్లాడుతూ.

కంట్రోల్ చేసుకున్నా.....

తెలుగులో మొదటి సినిమాతో బోల్డ్ గా నటించిన తనను అందరు అలానే ఉహించుకుంటున్నారని..ఓ సినిమాలో అవకాశం ఇస్తానంటూ ఓ వ్యక్తి కలిసాడని..నీకు ఆఫర్ ఇస్తే నాకు ఏమి ఇస్తావ్ అని డైరెక్ట్ గా అడిగాడని...ఆ ప్రశ్నతో షాక్ కు గురైయాని చెప్పింది. ఆ సందర్భంలో అతన్ని చెంప చెళ్లుమనిపించాలనిపించింది కానీ కంట్రోల్ చేసుకున్న అని చెప్పింది. నా టాలెంట్ కు టాలీవుడ్ లో గుర్తింపు లభించేదే కానీ ముద్దు సీన్స్ చేయడం వల్ల కాదని అతనికి గట్టిగా చెప్పానని..అతను ఇస్తానన్న ఆఫర్ ను తిరస్కరించి వచ్చేశానని వ్యాఖ్యానించింది.

Similar News