దర్శకుడు సుకుమార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన రంగస్థలం సినిమా కోసం చాలా రోజులు గోదావరి జిల్లాల్లోని గోదావరి పరిసరప్రాంతాల్లో షూటింగ్ చేసాడు. కానీ అక్కడ చరణ్ ఫాన్స్ వలన షూటింగ్ కి ఇబ్బంది కలగడంతో... హైదరాబాద్ నడిబొడ్డున అంటే జూబ్లీహిల్స్ వంటి కాస్ట్లీ ప్రాంతంలో రంగస్థలం కోసం 12 కోట్లతో పల్లెటూరి సెట్ వేశారు. మరా సెట్ లోనే సినిమా సగభాగం ని తెరకెక్కించారు. అయితే ఆ రంగస్థలం సెట్స్ ని సినిమా పూర్తయ్యాక కూడా తియ్యకుండా సందర్శనార్ధం అలానే ఉంచేశారు. ఇక అదే రంగస్థలం సెట్స్ లో చిరంజీవి తన సై రా నరసింహారెడ్డి షూటింగ్ కొంత కానిచ్చేశాడు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ రంగస్థలం సెట్స్ వేసిన స్థలం లో ఒక స్టూడియో ని నిర్మించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ లోని ఈ స్థలాన్ని రామ్ చరణ్ కొన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ప్లేస్ లోనే ఓ మెగా స్టూడియో ని కట్టాలన్న ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నాడట. నిజానికి చిరంజీవి కూడా ఎప్పటినుండో ఓ స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాడు. గతంలో చిరంజీవి వైజాగ్ లో సినిమా స్టూడియో కట్టే యోచనతో స్థలం చూసినట్టు టాక్ వినిపించింది. కానీ చిరు తర్వాత రాజకీయాల్లో బిజీ అవడంతో..ఆ ఆలోచన సైడ్ అవ్వడం జరిగింది.
అయితే ప్రస్తుతం హీరోగా, నిర్మాతగానే కాకుండా పలు వ్యాపారాల్లో కొనసాగుతున్న రామ్ చరణ్ ఇప్పుడు స్టూడియో ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే సై రా నిర్మతగా చేస్తూనే... బోయపాటి తన 12 వ సినిమాలో రామ్ చరణ్ బిజీగా వున్నాడు.