కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ కౌర్ ని అమెరికా పోలీసులు చికాగో సెక్స్ రాకెట్ విషయంలో అమెరికాలో ప్రశ్నించినట్టుగా... తర్వాత ఆమె చెప్పిన సమాధానాలు విన్న అమెరికా పోలీసులు మెహరీన్ కౌర్ కి సారి చెప్పి మరీ పంపించారనే న్యూస్ వచ్చింది. అయితే ఈ విషయమై మెహరీన్ ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా ఈ విషయమై మెహరీన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. గత కొన్ని రోజులుగా అమెరికాలోని చికాగోలో సౌత్ హీరోయిన్స్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే న్యూస్ మాత్రం ఒక ఊపు ఊపుతోంది.
ఆంగ్ల పత్రిక వార్తపై ఫైర్
అయితే ఆ సమయంలోనే తన పేరెంట్స్ తో పాటు అమెరికాకి వెళ్లిన మెహరీన్ ని ఎయిర్ పోర్ట్ లోనే అమెరికా పోలీసులు ప్రశ్నించినట్లుగా వచ్చిన వార్తలు నిజమేనట. తాజాగా పంతం సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కి వైరల్ ఫీవర్ వల్ల రాలేకపోయిన మెహరీన్ తన మీద ఓ ఇంగ్లీష్ పేపర్ లో వచ్చిన న్యూస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనని అమెరికా అధికారులు అరగంట పాటు
విచారించినట్టు ఆ పేపర్ రాసిన వార్తపై మెహరీన్ ఫైర్ అయ్యింది. తాను అమెరికా వెళ్లొచ్చాక ఎవరికీ ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదని... నా అనుమతి లేకుండా నా ఇంటర్వ్యూ అంటూ ఎవరో ఎదో రాస్తే ఊరుకోనని చెప్పిన మెహరీన్ తనని అమెరికా అధికారులు ప్రశ్నించిన విధానాన్ని వివరించింది.
నేను చెప్పింది విని సారీ చెప్పారు
తన తల్లితండ్రులతో కలిసి తాను కెనడా నుండి లాస్ వేగాస్కు వీకెండ్ హాలిడే కోసం అమెరికా వెళ్లానని... అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ కోసం అధికారుల వద్దకు వెళ్లినపుడు తనను హీరోయిన్గా గుర్తించిన అధికారులు... అమెరికా రావడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారని తెలిపింది. అయితే తనని ఇలా ప్రశ్నిచడానికి గల కారణం చికాగో సెక్స్ రాకెట్ వలన అని చెబితే ఆశ్చర్యపోయానని, నేను చికాగో సెక్స్ స్కాండల్ గురించి మొదటిసారి విన్నానని, అసలు అలాంటి విషయాలతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పిందట. దీంతో అక్కడి అధికారులు నేను చెప్పిన దాన్ని నమ్మి నాకు సారి చెప్పారని... అలాగే ఈ విషయమై ఇంతవరకు నేను ఎక్కడా మాట్లాడలేదని.. మొదటిసారి ఈ విషయమై మాట్లాడుతున్నానని కొంతమంది చేసే పనుల వలన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది అంటూ మెహరీన్ కౌర్ తన అమెరికా పర్యటనపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.