నాగబాబు ప్రొడ్యూసర్ గా నష్టపోయాడని అతన్ని ఆదుకోవడం కోసం బన్నీ తన డేట్ లు ఆయనకు ఇచ్చి, 'నా పేరు సూర్య' సినిమాకు నాగబాబుకు రాయల్టీ అందేలా చేసారు. అయితే నాగబాబు మాత్రం 'నా పేరు సూర్య' కి రూపాయి పెట్టుబడి పెట్టలేదు. కేవలం నాగబాబు దగ్గర బన్నీ డేట్స్ ఉన్నాయనే ఆయనను సినిమాకు ప్రెజెంటర్ ను చేసారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా దాని నిర్మాత లగడపాటి శ్రీధర్.. నాగబాబుకు అయిదు కోట్లు ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా అమ్మకాలు పూర్తయ్యాక నాగబాబుకు.. శ్రీధర్ అయిదుకోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు నిర్మాత శ్రీధర్ కి కూడా 15 నుంచి 20కోట్ల వరకు మిగిలిందట. కానీ సినిమా విడుదల తర్వాత 10కోట్ల వరకు శ్రీధర్ బయ్యర్లకు వెనక్కు ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
బన్నీవాస్ కే అసలు దెబ్బ..
కానీ మొత్తం మీద కాస్తో, కూస్తో మిగుల్చుకోగలిగారు శ్రీధర్. కానీ ఎటొచ్చీ మరో సహ నిర్మాతగా వ్యవహరించిన బన్నీవాస్ మాత్రం దొరికిపోయినట్లు తెలుస్తోంది. అతనికి కూడా కొంత మిగిలింది, కానీ ఓవర్సీస్ బయ్యర్ తో కుదుర్చుకున్న డీల్ లో, కొంత మొత్తానికి బన్నీవాస్ మధ్యలో హామీ ఉన్నారట. దాంతో ఆ లాభం కాస్తా అటు వెళ్లిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న బన్నీ తర్వాత ఎప్పుడైనా తనతో ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాడంట.