ఈ నెల 29న ‘నా లవ్ స్టోరి’

Update: 2018-06-20 13:19 GMT

అశ్విని క్రియేషన్స్ బ్యానర్ పై జి. లక్ష్మి నిర్మాతగా, శివగంగాధర్ దర్శకత్వంలో మహిధర్, సోనాక్షి సింగ్ రావత్ లను వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘నా లవ్ స్టోరీ’. ప్రేమ కథలలో ప్రత్యేకంగా నిలుస్తుందనే అంచానాలను తెచ్చుకున్న ఈ మూవీ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు, పాటలకు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా... నిర్మాత లక్ష్మి మాట్లాడుతూ... ‘ఈ సినిమా బొమ్మరిల్లు లాంటి క్యూట్ లవ్ స్టోరి, యూత్, ఫ్యామిలీ చూడవలసిన సినిమా ‘నా లవ్ స్టోరి’, హీరో, హీరోయిన్లు కొత్తవారైనా సీనియర్లకి ధీటుగా బాగా చేశారు.’ అన్నారు. డైరెక్టర్ శివగంగాధర్ మాట్లాడుతూ...‘కాలేజ్ లో అడుగు పెడుతున్న యూత్ కి, ముఖ్యంగా ఆడపిల్లలకి, కొత్తగా ప్రేమలో పడేవాళ్లకి ఆల్ రెడీ ప్రేమలో ఉన్న వారికి ప్రేమపై క్లారిఫికేషన్ ఇచ్చిన స్టోరి ‘నా లవ్ స్టోరి’. ‘అష్టాచమ్మా’, ‘ ఉయ్యాలా జంపాలా’,‘పెళ్ళి చూపులు’ లాంటి నేచురల్ లవ్ స్టోరి, కొత్త వాళ్లైనా బాగా చేశారు, సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది.’ అన్నారు.

Similar News