మంచి సీజన్ లో మంచి టైంలో సినిమా రిలీజ్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే డేట్, సీజన్ పై సినిమా వసూళ్లు ఆధారపడి ఉంటాయి. యావరేజ్ టాక్ ఉన్న సినిమాలు మంచి టైంలో రిలీజ్ చేస్తే కొంచెం సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. లేటెస్ట్ గా నాగ చైతన్య సినిమా 'శైలజా రెడ్డి అల్లుడు' వినాయక చవితి రోజున రిలీజ్ అయింది. ఆ రోజున విడుదల అవ్వటం ఈ సినిమాకు చాలా హెల్ప్ అయింది. మొదటి రోజు ఈ చిత్రం ఏడు కోట్ల షేర్ రాబట్టుకుంది. దీంతో ఓవరాల్ గా ఈ సినిమా ఫ్లాప్ అయినా మొదటి రోజు కలెక్షన్స్ తో కాస్త గట్టెక్కింది. అయితే నాగ చైతన్య నెక్స్ట్ మూవీ 'సవ్యసాచి' విషయంలో తప్పు చేస్తున్నాడు.
మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..?
ఈ సినిమాను నాన్ సీజన్ లో అంటే నవంబర్ లో విడుదల చేస్తున్నారు. నవంబర్ లో ఎటువంటి హాలిడేస్ లేని టైంలో విడుదల చేయడం వల్ల ఈ చిత్రానికి బాగుంది అని టాక్ వచ్చినా వసూళ్లు దక్కించుకోడం కష్టమే అంటున్నారు. గతంలో 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాన్ని కూడా నాన్ సీజన్ లో రిలీజ్ చేసి నిర్మాతలు చేతులు కాల్చుకున్నారు. మళ్లీ చైతు అటువంటి తప్పు ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావట్లేదు. కొంచం చూసి అలోచించి చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అంటున్నారు ట్రేడ్ వారు.