నాగార్జున పదిహేనేళ్ల తర్వాత బాలీవుడ్లో సినిమా చేస్తున్నాడు. రణ్‌బీర్‌కపూర్, అమితాబ్ బచ్చన్, అలియాభట్‌లతో కలిసి అక్కడ నటిస్తున్నారు. ఆ సినిమా ఓకే అయినప్పట్నుంచి నాగార్జున బాలీవుడ్ వెళ్లడం గురించి టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఇదే విషయం గురించి ఆయన దగ్గర ప్రస్తావిస్తూ ఉన్నట్టుండి బాలీవుడ్ వెళ్లారేంటి అని అడిగేసరికి ''నేను బాలీవుడ్ వెళ్లడమేంటి? వాళ్లే నా దగ్గరికొచ్చారు'' అంటూ సమాధానమిచ్చాడు నాగ్.
ఆ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. సినిమాలో నాగార్జున పాత్ర పదిహేను నిమిషాలే ఉంటుందట. అయితే అది కథలో చాలా కీలకమట. ఈ సినిమా ఒప్పుకోవడం వెనక చాలా తతంగం జరిగిందనీ... కథ చెప్పాక మూడు నెలల తర్వాతే నేను ఒప్పుకొన్నానని చెప్పుకొచ్చాడు నాగ్. కథ చెప్పడమే కాకుండా... క్యారెక్టర్ గురించి త్రీడీ యానిమేషన్లో డిజైన్ చేసుకొని వచ్చి చూపిస్తే తప్ప నాగ్ ఒప్పుకోలేదట. ''మీరు నటించాల్సిందే, మీకోసం మేం వెయిట్ చేస్తున్నామ''ని నిర్మాత కరణ్‌జోహార్ చెప్పాడట. అప్పుడే నాగ్ ముంబై ఫ్లైటెక్కాడట. నాగార్జున క్రేజ్ అలాంటిది మరి. ఆయనకి తెలుగులోనే కాదు.. బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో చాలా సినిమాలు చేశారక్కడ. అయితే తనకి తెలుగు భాషే తొలి ప్రాధాన్యమని, ఆ తర్వాతే మిగతా భాషలని చెప్పుకొచ్చాడు నాగ్