ఈ శుక్రవారం రిలీజ్ అయిన మాస్ రాజా రవితేజ 'నెల టిక్కెట్టు' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి ఆటతోనే బోల్తాపడింది. రిలీజ్ కి ముందు నుండే ఈ సినిమాపై అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు.రవితేజ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగా కనిపించాయి. ఉదయం ఆట నుండే బ్యాడ్టాక్ రావడంతో ఈ సినిమాను చూసే జనాలే కరువయ్యారు. రవితేజ గత చిత్రం ‘టచ్ చేసి చూడు’ కూడా ఇదే రెజల్ట్ వచ్చింది. కానీ ఈ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గత రెండు సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు తీసిన అతనే ఈ 'నెల టిక్కెట్టు' సినిమాను తీసాడా అని అర్ధం కావడం లేదు.
గత సినిమాల వెనుక నాగార్జున శ్రమ...
‘సోగ్గాడే..’, ‘రారండోయ్..’ సినిమాలకు రీషూట్లు జరగడం.. ఎడిటింగ్ దశలో మార్పులు చేర్పులు జరగడం గురించి అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాల అవుట్ ఫుట్ రావడానికి కారణం నాగార్జునే అని తెలిసిన విషయమే. ఆ సినిమాల అవుట్ పుట్ తో నాగ్ సంతృప్తి చెందక వేరే రైటర్ల సహాయం తీసుకుని మార్పులు చేర్పులు చేయించడం బహిరంగ రహస్యమే. అయితే ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ బయట బ్యానర్ లో 'నెల టిక్కెట్టు' లాంటి పేలవమైన సినిమా అందించేసరికి అతడి గత రెండు సినిమాల్లో నాగ్ ది చాలా కీలకమైన బాధ్యత అని మరోసారి అర్ధం అవుతుంది. ఈ సినిమాను చూసిన తర్వాత ఎంతైనా నాగార్జున నాగార్జుననే అని ఆయన్ని పొగుడుతుండటం విశేషం.