ప్రస్తుతం బిగ్ బాస్ 2 తో పాటు నాగార్జునతో మల్టీ స్టార్రర్ లో నటిస్తున్న నాని లేటెస్ట్ గా 'జెర్సీ' అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. మళ్లీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఇది క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఇందులో నాని క్రికెటర్ గా దర్శనం ఇవ్వనున్నాడు. అయితే దీనికి సంబంధించి డైరెక్టర్ గౌతమ్ అప్ డేట్స్ ఇచ్చాడు.
ఇది 80-90 మధ్య జరిగే కథ అంట. అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి పూర్తి వ్యతిరేకంగా చూపించనున్నాడు గౌతమ్. ఇందులో నాని ఓ క్రికెటర్. అతనికి టాలెంట్ ఉన్న నేషనల్ లెవెల్ లో క్రికెట్ ఆడడానికి అవకాశం రాకపోవడంతో సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఓ లోకల్ మ్యాచ్ సందర్భంగా సబ్ స్టిట్యూట్ గా వెళ్తాడు. అక్కడ ఊహించని విధంగా తన టీం గెలుపు కు కారణం అవుతాడు. దాంతో అతని జీవితం మారిపోతుంది.
ఎట్టిపరిస్థితుల్లో నేషనల్ లెవెల్ లో ఆడాలని లక్ష్యం పెట్టుకుంటాడు నాని. ఆ క్రమంలో ఎన్నెన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు. అన్నింటిని దిగమింగుకుని తానేంటో ప్రపంచానికి చాటి చెప్పేలా నాని టార్గెట్ చేరుకుంటాడు. అది స్టోరీ లైన్. దీనిబట్టి చూస్తుంటే.. స్పోర్ట్స్ డ్రామాలు లేని టాలీవుడ్ లో గౌతమ్-నాని ఇద్దరు కలిసి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక ఇందులో నానికి జోడిగా శృతి హాసన్ నటించనుంది. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది