Nani : నాని హిట్ 3 మూవీ ట్రైలర్ అదిరిపోయిందిగా.. ఫ్యాన్స్ కు గూస్ బంప్ప్

నేచురల్ స్టార్ నాని మూవీ అంటే అదొక స్పెషల్. అందరి ఫ్యాన్స్ నాని నటించిన సినిమాను చూసేందుకు ఇష్టపడతారు;

Update: 2025-04-14 07:25 GMT
nani, natural star, hit 3 movie, trailor
  • whatsapp icon

నేచురల్ స్టార్ నాని మూవీ అంటే అదొక స్పెషల్. అందరి ఫ్యాన్స్ నాని నటించిన సినిమాను చూసేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను నాని ఎంపిక చేసుకుంటారన్నది బలంగా ముద్రపడింది. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా నాని కెరీర్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకుసాగిపోతుంది. మినిమం హిట్ ఇచ్చే హీరో అన్న పేరు నానికి టాలీవుడ్ లో ముద్రపడిపోయింది. పాన్ఇండియా స్టార్ కావాలన్న తపన కన్నా ఎక్కువగా తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు నాని ఇష్టపడతాడంటారు.

బిగ్ స్క్రీన్ లపై...
అలాంటి నాని నటించిన మూవీలను బిగ్ స్క్రీన్ లపైనే చూసేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. మినిమం ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చి నాని తన నిర్మాతలకు గ్యారంటీ లాభాలను ఆర్జించి పెడతారు. సినిమాల్లో నటించకుండా మంచి సినిమాలను నిర్మించే నిర్మాతగా కూడా నానికి మంచి పేరుంది. చిన్న చిన్న స్టార్లను ప్రోత్సహించడమే కాకుండా, వెరైటీ కథలకు ఆయన ఇచ్చే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. అలాంటి నాని తదుపరి చిత్రం కోసం అందరి హీరోల అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హిట్ 3 మూవీ ట్రైలర్ విడుదల...
తాజాగా నాని హిట్ 3లో నటిస్తున్నాడు. శైలేజ్ కొలనులో ఈసినిమా సిద్ధమవుతుంది. ఈసినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఈమూవీలో నాని ఒక సమర్థుడైన పోలీసు అధికారిగా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. దీనికి సంబంధించిన కీలక అప్ డేట్ తో పాటు ట్రైలర్ ను కూడా నిర్మాతలు కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. అర్జున్ సర్కార్ పాత్రలో నాని ఈ మూవీ లో కనిపించనున్నాడు. హత్యలను ఛేదించే పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నాని కనిపిస్తుండటంతో పాటు వెరైటీ కథనం తో మూవీ తెరకెక్కిందని చెబుతున్నారు. ఈ మూవీ మే 1న విడుదల అవుతుంది.
Tags:    

Similar News