నీలాంబరి పాత్రలో నయన్!

ఆమధ్య రజినీకాంత్ నటించిన ‘నరసింహా’ సినిమా ఎంత హిట్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. అందులో రజినీతో పాటు రమ్య కృష్ణ ‘నీలాంబరి’గా గుర్తు ఉండిపోయే పాత్ర [more]

;

Update: 2020-04-25 07:50 GMT
Nayanatara
  • whatsapp icon

ఆమధ్య రజినీకాంత్ నటించిన ‘నరసింహా’ సినిమా ఎంత హిట్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. అందులో రజినీతో పాటు రమ్య కృష్ణ ‘నీలాంబరి’గా గుర్తు ఉండిపోయే పాత్ర చేసింది. ఆ తరువాత అటువంటి పాత్ర చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. లేటెస్ట్ గా అటువంటి పాత్రే చేయడానికి నయనతార రెడీ అవుతుంది.

రీసెంట్ గా సైన్ కూడా చేసింది నయన్. మలయాళ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. మలయాళ సినిమా కాబట్టి పైగా సొంత గడ్డపై సినిమా అనే సరికి నయనతార ఆ పాత్రను చేయడానికి వెంటనే అంగీకరించిందని అంటున్నారు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా పెద్ద గా పట్టించుకోకపోగా, ఈ సినిమా ప్రమోషన్స్ కి కూడా వస్తానని చెప్పిందట. సాధారణంగా నయన్ తన సొంత సినిమాల ప్రమోషన్స్ కి అసలు రాదు. కానీ ఈసినిమా ప్రమోషన్ కి వస్తా అంటుందంటే ఆమెకు ఆ పాత్ర ఎంత నచ్చి ఉంటుందో..

Tags:    

Similar News