పెళ్లి వయసు వచ్చిందంటున్న నయన్ లవర్ !

Update: 2018-05-18 09:34 GMT

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విజ్ఞేశ్ శివన్ మధ్య ప్రేమకథ ఎప్పటి నుంచో ఉంది. ఇద్దరు కలిసి టూర్లకు వెళ్లడం, సినిమా ఫంక్షన్స్ కి వెళ్లడం ఇలా చాలానే చేసారు. అయితే వీరి పెళ్లి విషయం గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు. పైగా ఇద్దరు తమ ప్రేమ గురించి పబ్లిక్ గా ఒప్పుకోవడం లేదు.

పాటను అందుకున్నాడు...

ఇది ఇలా ఉండగా నయనతార కొత్తగా నటించిన కొలమావు కోకిల సినిమా నుండి కళ్యాణ వయసు అనే ఓ సాంగ్ రిలీజ్ చేసారు. ఆ సాంగ్ స్టార్టింగ్ లో మొదటి రెండు అక్షరాలు చూస్తేనే అది పెళ్లి పాట అని ఈజీగా అర్థమవుతుంది. దీన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విజ్ఞేశ్ ఆ పోస్ట్ కింద 'నాక్కూడా పెళ్లి వయసు వచ్చిందిరా' అంటూ కామెంట్ పెట్టాడు. అంటే ఇండైరెక్ట్ గా నయన్ కు ప్రపోజ్ చేసి త్వరగా పెళ్లి చేసుకో అని హింట్ ఇస్తున్నాడు.

ఏడాది వరకూ బీజీనే...

ఇంకా దీనికి నయన్ స్పందించలేదు. విజ్ఞేశ్ ఇలా ఎంత మొత్తుకున్నా లాభం లేదు. ఎందుకంటే నయనతారకు సినిమా కమిట్ మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. టాలీవుడ్ లో 'సైరా' లో లీడ్ రోల్చే చేస్తున్న ఈమెకు దీనితో పాటు తమిళ్ లో నాలుగైదు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి పూర్తి చేయాలంటే ఎంతలేదన్నా కనీసం ఏడాదికి పైగా పడుతుంది. అంటే ఇప్పట్లో నయన్, విజ్ఞేశ్ పెళ్లి లేదని అర్ధం అవుతుంది. అప్పటివరకు విజ్ఞేశ్ ఆలా పోస్ట్స్ చేస్తూ ఉండడమే.

Similar News