రవితేజ కొత్త సినిమా 'నేలటిక్కెట్టు' వచ్చే శుక్రవారం రిలీజ్ కానుంది. ఇంతవరకు ఈ సినిమాపై ఎటువంటి హైప్ లేదు. మేకర్స్ ఎలాగైనా ఈ సినిమాపై మించి హైప్ తీసుకుని రావాలని చాలానే ట్రై చేసారు. కానీ అవేవీ ఫలించలేదు. ట్రైలర్, టీజర్, వీడియో సాంగ్ టీజర్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా తీసుకుని రావడం, ఇలా చాలానే చేసిన సినిమాపై జనాల్లో అంత క్యూరియాసిటీ ఏమిలేదు.
రోటీన్ గా ఉన్నందునే...
దాని తోడు ఈ సినిమా ట్రైలర్ చూస్తే రవితేజ మార్క్ రొటీన్ గా అనిపిస్తూ ఉండటంతో దీనిని సినీ ప్రియులు పట్టించుకోవడం లేదు. రవితేజ లాస్ట్ మూవీ 'టచ్ చేసి చూడు' ఎప్పుడు రిలీజ్ అయ్యి ఎప్పుడు వెళ్లిందో కూడా జనాలకి తెలియకపోవడంతో ఆ సినిమా ప్రభావం 'నేల టిక్కెట్టు' పైన పడింది.
రెండు హిట్లు వచ్చినా...
'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలతో వరసగా రెండు హిట్స్ ఇచ్చినా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు ఇంతవరకు ప్రేక్షకుల్లో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు ఏమి రాలేదు. జనాల్లో ఈ సినిమాపై హైప్ లేకపోవడానికి మెయిన్ కారణం ఈ సినిమా తాలూకు ప్రమోషన్స్ ఇన్నోవేటివ్ గా లేకపోవడం. దానికితోడు ఆడియో కూడా మెప్పించలేకపోవడం మరో మైనస్‌గా మారింది. ప్రొమోషన్స్ చేయకపోయినా సినిమా అయినా హిట్ అవుతుందేమో చూద్దాం.