#RRR పై అది రూమారా..నిజామా…?

టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ గా రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న RRRపై ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. [more]

Update: 2019-01-22 11:32 GMT

టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ గా రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న RRRపై ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. నవంబర్ లో మొదలైన RRR షూటింగ్ అప్పుడే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సెకండ్ షెడ్యూల్ తో రాజమౌళి RRR సెట్స్ పైనున్నాడు. ఇంకా హీరోయిన్స్ ని కూడా ఎంపిక చెయ్యని జక్కన్న RRR షూటింగ్ ని మాత్రం పరిగెత్తిస్తున్నాడు. కొడుకు కార్తికేయ పెళ్ళికి ఒక నెల గ్యాప్ తీసుకున్న జక్కన్న ఇప్పుడు పూర్తిగా తన దృష్టిని RRR పైనే పెట్టాడు. ఇక సినిమా అనౌన్స్ మెంట్ నుండి భారీ అంచనాలున్న ఈ సినిమాపై ఇప్పుడొక న్యూస్ ఫిలింసర్కిల్స్ ని షేక్ చేస్తుంది.

భారీ ధర ఆఫర్ చేసిన జీ

అదేమిటంటే RRR మూవీని బాహుబలి లాగానే పలు భాషల్లో విడుదల చెయ్యడానికి జక్కన్న సన్నాహాలు చేస్తున్నాడట. అయితే వివిధ భాషల్లో విడుదలవుతున్నందున ఈ RRR మూవీ శాటిలైట్స్ హక్కుల కోసం పలు బడా ఛానల్స్ పోటీ పడుతున్నట్లుగా.. అందులోని జీ టెలివిజన్ నెట్ వర్క్ వారు RRR తెలుగు, తమిళ, హిందీ శాటిలైట్ రైట్స్ కోసం 150 కోట్లు కోట్ చేసినట్టుగా ఒక వార్త మీడియాలో, ఫిలింసర్కిల్స్ లోను షికారు చేస్తోంది.

హోల్డ్ లో పెట్టిన నిర్మాత

అయితే RRR నిర్మాత డీవీవీ దానయ్య జీ నెట్ వర్క్ వారికి ఆ రేటుకి మాటివ్వకుండా హోల్డ్ లో పెట్టినట్లుగా చెబుతున్నారు. మరి జక్కన్న సినిమాలంటే ఆ మాత్రం క్రేజుంటుంది. బాహుబలితో రాజమౌళి క్రేజ్ ఎల్లలు దాటింది. అందుకే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఈ రేంజ్ క్రేజుంది. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఒక సినిమాలో నటించడమంటే… ఆ సినిమా క్రేజ్ ఎలాంటిందో ఊహించడానికి కష్టమే.

Tags:    

Similar News