ఓటిటి దెబ్బకి శాటిలైట్ హక్కులు గోవిందా?

థియేటర్స్ మూత బడడంతో ఓటిటి సంస్థలు ఓ రేంజ్ క్రేజ్ తో పై పై కి వెళ్లిపోయాయి. గతంలో సినిమా.. థియేటర్స్ లో విడుదలవ్వాలి.. ఓ నెల, [more]

Update: 2020-11-06 09:19 GMT

థియేటర్స్ మూత బడడంతో ఓటిటి సంస్థలు ఓ రేంజ్ క్రేజ్ తో పై పై కి వెళ్లిపోయాయి. గతంలో సినిమా.. థియేటర్స్ లో విడుదలవ్వాలి.. ఓ నెల, రెండు నెలల వరకు ప్రేక్షకుడికి ఓటిటిలో సినిమా దొరికేది కాదు.. ఈలోపు ఓటిటి ఏమీద ప్రేక్షకుడుగా అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. అలాగే ఆ సినెమా శాటిలైట్ హక్కుల కింద అమ్మేస్తే.. ఆయా ఛానల్ లో సినిమా ప్రసారం అయినప్పుడు ఇంటిల్లిపాది ఆ సినిమాని వీక్షించేవారు కానీ…పెద్దగా ఓటిటి ని ఎంకరేజ్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు థియేటర్స్ బంద్.. అందుకే ఓటిటీలతో బేరాలు కుదుర్చుకుంటున్న సినిమాలు ఓటిటి డేట్ రోజున విడుదల కావడంతో ఇంటిల్లిపాది ఆ సినిమాని ఓటిటిలో చూసేస్తున్నారు. ఇక ఆ సినిమా శాటిలైట్ హక్కులను కొన్న ఛానల్ లో ప్రసారం చేసినా ఆ సినిమాకి హిట్ టీఆర్పీ రావడం లేదు.

మరి తాజాగా నితిన్ భీష్మ సినిమా ఓటిటి దెబ్బకి శాటిలైట్ హక్కులు కొన్న ఛానల్ కి దారుణమైన టిఆర్పి మూటగట్టుకుంది. నితిన్ – రష్మిక భీష్మ సినిమా కరోనా కన్నా ముందు థియేటర్స్ లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక డిజిటల్ హక్కులు కొన్న ఓటిటి భీష్మాని ఏప్రిల్ 27 న స్ట్రీమింగ్ చేసేసింది. లాక్ డౌన్ లో థియేటర్స్ లేకపోవడం, సినిమాలు లేకపోవడంతో చాలావరకు ఓటిటిలోనే భీష్మ చూసేసారు. మరి అప్పటినుండి గత వారం వరకు భీష్మ శాటిలైట్ హక్కులు దక్కించుకున్న జెమిని వారు ఆ సినిమాని ప్రసారం చెయ్యలేదు. అయితే భీష్మ సినిమాని దసరా రోజున జెమిని లో ప్రసారం చెయ్యగా ఆ సినిమాకి దారుణమైన టీఆర్పీ రేటింగ్ వచ్చింది. హిట్ సినిమాకి అంత తక్కువ టీఆర్పీ రావడం చూస్తే ఓటిటి హవా ఎలా నడుస్తుందో ఆర్ధమవుతుంది. మరి ఇలానే థియేటర్స్ బ్యాన్ కొనసాగుతూ ఓటిటీల హవా ఉంటే.. సినిమాల శాటిలైట్ హక్కుల పని గోవిందా అనేలా ఉంది.

Tags:    

Similar News