నానికి బుల్లితెర కూడా షాకిచ్చింది!

నాని హీరో అయినప్పటినుండి స్టిల్ ఇప్పటివరకు వరస సినిమాలు ప్రకటిస్తూ షూటింగ్స్ తో ఎపుడూ బిజీగా ఉండే నాని.. వీలయితే ఏడాదికి రెండు సినిమాలు థియేటర్స్ లో [more]

Update: 2020-12-18 05:08 GMT

నాని హీరో అయినప్పటినుండి స్టిల్ ఇప్పటివరకు వరస సినిమాలు ప్రకటిస్తూ షూటింగ్స్ తో ఎపుడూ బిజీగా ఉండే నాని.. వీలయితే ఏడాదికి రెండు సినిమాలు థియేటర్స్ లో దింపేస్తాడు. కానీ ఈ ఏడాది కరోనా నాని స్పీడుకి బ్రేకులు వేసింది. ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నాని విలన్ గా నటించిన ‘వి’ సినిమాని ఎక్కువగా నాని 25 వ సినిమాగానే ప్రమోట్ చేసారు. నాని 25 వ సినిమాగా ప్రచారం జరిగిన ‘వి’ సినిమా థియేటర్స్ లో విడుదల చేసి ఆనందించాలి అనుకుంటే కోవిడ్ నాని ఆశలపై నీళ్లు చల్లింది. ఇక అమెజాన్ ప్రైమ్ వారు భారీ డీల్ ఇవ్వడంతో ఓటిటికి అమ్మేసి.. భారీ ప్రమోషన్స్ చేసి విడుదల చేసారు ఇంద్రగంటి అండ్ టీం.

ఇష్టం ఉన్న లేకపోయినా ఆఖరికి ఓటిటికి తలవంచిన నాని కి ‘వి’ ఓటిటిలో షాకిచ్చింది. భారీ ప్రమోషన్స్ ఉన్నప్పటికీ.. వి కి కలిసిరాలేదు. కానీ తర్వాత ‘వి’ సినిమాని ప్లాప్ గా తెలిచేసారు ట్రేడ్ పండితులు. ఓటిటి లో ప్లాప్ అయిన ‘వి’ సినిమాని తాజాగా శాటిలైట్ హక్కులు చేజిక్కించుకున్న జెమిని ఛానల్ వారు వరల్డ్ ప్రీమియర్ అంటూ హైప్ క్రియేట్ చేసి మరీ ఓ ఆదివారం సాయంత్రం ప్రసారం చెయ్యగా ‘వి’ సినిమాకి వీక్ టీఆర్పీస్ వచ్చినట్టుగా సమాచారం. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులముందుకు వచ్చిన ‘వి’ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వి సినిమాకి కేవలం 6.8 టీఆర్పీ వచ్చింది. మరి నాని గత చిత్రాలకు ప్లాప్ టాక్ పడినా.. బుల్లితెర మీద ఇంత దారుణమైన టీఆర్పీస్ రాలేదు. కానీ ‘వి’ సినిమా మరీ దారుణమైన టీఆర్పీ సొంతం చేసుకుని బుల్లితెర మీద ప్లాప్ షో గా మిగిలిపోయింది.

Tags:    

Similar News