కథానాయకుడు దెబ్బకి మహానాయకుడు విలవిలా

ఎన్టీఆర్ జీవిత చరిత్ర కథానాయకుడు సంక్రాతి కానుకగా భారీ అంచనాల నడుమ భారీగా థియేటర్స్ లోకొచ్చింది. క్రిటిక్స్ ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ బయోపిక్ ని అబ్బో సూపర్ [more]

Update: 2019-01-20 04:37 GMT

ఎన్టీఆర్ జీవిత చరిత్ర కథానాయకుడు సంక్రాతి కానుకగా భారీ అంచనాల నడుమ భారీగా థియేటర్స్ లోకొచ్చింది. క్రిటిక్స్ ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ బయోపిక్ ని అబ్బో సూపర్ డూపర్ హిట్ అన్నారు… కానీ కలెక్షన్స్ దగ్గరకొచ్చేసరికి కథానాయకుడు బాక్సాఫీసు వద్ద బావురుమంది. ఎంతగా హిట్ టాక్ పడినా.. ప్రేక్షకులు నుండి స్పందన కరువయ్యింది. క్రిష్ డైరెక్షన్, బాలకృష్ణ నటనను వేయినోళ్ల పొగిడిన ప్రేక్షకులే కథానాయకుడిని చూడడానికి థియేటర్స్ కి రాకుండా మొహం చాటేశారు. సంక్రాతి సెలవలని క్యాష్ చేసుకుందామనుకున్న బాలకృష్ణ బృందానికి కథానాయకుడు కోలుకోలేని షాకిచ్చింది.

అయితే కథానాయకుడు విడుదలైన మొదటి రోజు… ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు మీద భారీ అంచనాలున్నాయి.. కథానాయకుడు కాస్త స్లోగా ఉన్నా. మహానాయకుడు కొట్టేస్తుందని అన్నారు. కథానాయకుడు భారీగా బిజినెస్ చేసుకుంది.. కానీ కలెక్షన్స్ వీక్ గా ఉండడంతో.. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కాస్తా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా మీద పడింది. కథానాయకుడు కొన్న బయ్యర్లు మహానాయకుడు సినిమాని ఫ్రీగా ఇవ్వమని అడుగుతున్నట్టుగా ప్రచారం మొదలైంది. మరోపక్క బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తో కోట్లకు పడగెత్తుదామనుకుని భంగపడ్డాడు. కథానాయకుడు లాస్ ని మహానాయకుడు భర్తీ చెయ్యాల్సిన అగత్యం ఏర్పడింది.

తాజాగా మహానాయకుడు విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. మహానాయకుడు ఒరిజినల్ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 7 కానీ.. తాజాగా కథానాయకుడు షాక్ తో మహానాయకుడు పోస్టుపోన్ అయినా అవ్వచ్చని ప్రచారం మొదలయ్యింది. మహానాయకుడు యూనిట్ ఎంతగా సినిమా ఫిబ్రవరి 7 కే అని చెబుతున్నా.. బయట మాత్రం మహానాయకుడు ఫిబ్రవరి 7 కి రావడం కష్టమంటున్నారు. కథానాయకుడు లో జరిగిన పొరబాట్లు మహానాయకుడిలో జరక్కుండా ఉండాలని మహానాయకుడు టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేస్తున్న క్రిష్ టీం మహానాయకుడు నిడివి మీద కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే కథానాయకుడికి నిడివి పెద్ద శాపంలా మరింది కానక. మరి మహానాయకుడు నిడివి ఎంత ఉంచుతారో అనేది సెన్సార్ కి వెళితే గనక తెలియదు

Tags:    

Similar News