నా భార్య నుండికొడుకుని కాపాడలేనంటున్న ఎన్టీఆర్

Update: 2018-06-10 06:36 GMT

ఎన్టీఆర్ యంగ్ టైగర్ గా సినిమాలను ఒంటి చేత్తో దున్నేస్తున్నాడు. గత నాలుగు సినిమాలు హిట్ అవడంతో మాంచి జోరుమీదున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సామెత - వీర రాఘవ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అటు రియల్ లైఫ్ లోను బిజినే. ఇక తన ఫ్యామిలీకి సంబందించిన హ్యాపీ మూమెంట్స్ ను అభిమానులతో తెగ షేర్ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి తో పాటుగా తన కొడుకు అభయ్ రామ్ తో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు. తన కొడుకు అభయ్ రామ్ కి అస్సలు భయం లేదని.. ఇంట్లో వాడు అల్లరి భరించడం కష్టమని.. అందరూ వాడిని అంటే తన తల్లి ఇలా అందరూ వాడ్ని గారాభం చేస్తాడని ఎన్టీఆర్ చాలాసార్లు చెప్పాడు.

అయితే ఒక విషయంలో మాత్రం అభయ్ రామ్ పిల్లి అట. ఎందుకంటే అభయ్ రోజు తాగాల్సిన పాల కోటాకు సంబందించిన విషయంలో అభయ్ ను వాళ్ల అమ్మ ప్రణతి నుంచి ఎవ్వరూ కాపాడలేరంట. ఈ విషయాన్నీ స్వయాన ఎన్టీఆర్ చెబుతున్నాడు. ఎన్టీఆర్ సరదాగా ఒక ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దానికింద క్యాప్షన్ గా వాళ్ళమ్మ నుండి పాలు తాగే విషయంలో అభయ్ ని ఎవరు కాపాడలేరనే క్యాప్షన్ పెట్టాడు. ఇక ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఫోటో లో అభయ్ రామ్ భయపడుతూ పెద్ద గ్లాస్ లో పాలుతాగుతూ ఉంటె.. లక్ష్మి ప్రణతి కొడుకు అభయ్ ముందు నుంచుని ఉంది. మరి తల్లికి భయపడుతూ అభయ్ పాలు తాగే ఆ ఫోటో భలే ఉంది.

మరి ఎన్టీఆర్ అలా ఫోటో తో పాటుగా ఫన్నీగా క్యాప్షన్ పెడితే... దానికి కమెడియన్ వెన్నెల కిషోర్ క్యూట్‌నెస్‌ ఓవర్‌లోడెడ్‌ అంటూ ట్వీట్‌ రీ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పోస్ట్ చేసిన అభయ్ భయపడే ఆ పిక్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Similar News