5 భాషల్లో డబ్బింగ్ చెప్పనున్న ఎన్టీఆర్
రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం #RRR షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రాజమౌళి తో పాటు ఎన్టీఆర్ రీసెంట్ గా [more]
రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం #RRR షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రాజమౌళి తో పాటు ఎన్టీఆర్ రీసెంట్ గా [more]
రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం #RRR షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. రాజమౌళి తో పాటు ఎన్టీఆర్ రీసెంట్ గా బల్గేరియా కి వెళ్లారు. అక్కడ తారక్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రికరించనున్నారు. 3 వారాల పాటు సాగే సుదీర్ఘ షెడ్యూల్ కోసం బల్గేరియాలో షూట్ ప్లాన్ చేశారట రాజమౌళి. ఎన్టీఆర్ పై కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రకరించనున్నారు. రామ్ చరణ్ ఈ షెడ్యూల్ తరువాత షెడ్యూల్ కోసం కసరత్తులు చేస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్ ఈమూవీ కోసం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చెప్పబోతున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్ నాలుగు భాషలను నేర్చుకుంటున్నాడట. తన వాయిస్ ని వేరే ఎవరు చెప్పకూడదని అలా చెపితే పాత్ర కి న్యాయం జరగదు అని తారక్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో తారక్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అందుకు గాను ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. వచ్చే ఏడాది 2020 లో జులై 30 న ఈమూవీ రిలీజ్ కానుంది.