ఇక రెస్ట్ తీసుకోబోతున్న ఎన్టీఆర్..!

Update: 2018-10-04 06:48 GMT

రాజమౌళి మల్టీస్టారర్ సినిమా కోసం ఎన్టీఆర్ అరవింద సమేతని ఆగమేఘాల మీద పూర్తి చేస్తున్నాడని.. కాదు కాదు దసరా బరిలో నిలపడం కోసమే షూటింగ్ ని పరిగెత్తిస్తున్నారనే ప్రచారం మాములుగా జరగలేదు. అయితే పై రెండిట్లో నిజాలు లేకపోలేదు. అరవింద సమేత షూటింగ్ మొదలైన నేపథ్యంలో ఎన్టీఆర్ అసలు రెస్ట్ అనేది తీసుకోకుండా అరవింద సెట్స్ లో ఉండేవాడు. ఇక ఈ షూటింగ్ సకాలంలో పూర్తి చేసేందుకు గాను స్టార్ మాలో భారీ పారితోషకం ఇచ్చే బిగ్ బాస్ సీజన్ 2ని వదులుకున్నాడు ఎన్టీఆర్.

బాధను మోస్తూనే షూటింగ్ పూర్తిచేసి...

ఇక అన్నీ ఓకే... సినిమా అనుకున్న టైంకి వచ్చేస్తుందనగా ఆగస్టు 29న నందమూరి హరికృష్ణ మరణించారు. ఇక అంత దుఃఖం లోనూ ఎన్టీఆర్ నిర్మాత రాధాకృష్ణ నష్టపోకూడదని... సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని.. తండ్రి మరణాన్ని తట్టుకుని, బాధను గుండెల్లో మోస్తూ... హరికృష్ణ మరణించిన ఐదో రోజే షూటింగ్ సెట్స్ కి వెళ్లి.. అప్పటి నుండి.. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మానేసి నెలరోజులుగా ఎంతగా కష్ట పడ్డాడో అరవింద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కళ్యాణ్ మాటలను బట్టి.. ఎన్టీఆర్ మోస్తున్న బాధను ఆయన కన్నీళ్ల రూపంలో చూసాం.

రెస్ట్ తీసుకోనున్నాడా..?

అరవింద సమేతను అనుకున్న టైంకే థియేటర్స్ లోకి తెచ్చేందుకు ఎన్టీఆర్ పడిన కష్టం అంతాఇంతా కాదు. ఇక అరవింద షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు పబ్లిసిటీ ని మొదలు పెట్టేసింది. కచ్చితంగా మరో వారంలో థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా కోసం అరవింద టీం అద్భుతమైన ప్రమోషన్స్ ప్లాన్ చేసిందట. ఇక అరవింద ప్రమోషన్స్ చక్కబెట్టేసి ఎన్టీఆర్ ఒక నెల రోజుల పాటు రెస్ట్ తీసుకునే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక సినిమా పని పూర్తి కాగానే ఎన్టీఆర్ కాస్త రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇక నెలరోజుల రెస్ట్ తర్వాతే ఎన్టీఆర్ రాజమౌళి మల్టీస్టారర్ కోసం సన్నద్ధం అవుతాడని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్న మాట.

Similar News