సిక్స్ ప్యాక్ గురించి తారక్ మాటల్లో

Update: 2018-10-07 03:41 GMT

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 'అరవింద సమేత' సినిమా చేశాడు. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్న ఈసినిమా కోసం తారక్ ఎంత కష్టపడ్డాడో అందరికి తెలిసిన విషయమే. టెంపర్ తర్వాత తారక్ మళ్లీ చొక్కా విప్పి త‌న సిక్స్ ప్యాక్ చూపించాడు. ఈ సిక్స్ ప్యాక్ కోసం తారక్ చాలానే కష్టపడ్డాడు. అయితే కొంతమంది ఇది ఒరిజినల్ సిక్స్ ప్యాక్ కాదని..గ్రాఫిక్స్ అని మాట్లాడుతున్నారు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో తమన్.."తారక్ సిక్స్ ప్యాక్ కోసం ప‌ద‌కొండు రోజుల పాటు.. కేవ‌లం నీళ్ల‌నే ఆహారంగా తీసుకున్నాడు" అని అన్నాడు. అయితే నిన్న జరిగిన ఇంటర్వ్యూలో తారక్ దగ్గర దీని గురించి ప్ర‌స్తావిస్తే…సిక్స్ ప్యాక్ కోసం అందరు కష్టపడినట్టే నేను కష్టపడ్డాను. 'జై లవకుశ' టైములో నేను కొంచం లావు అయ్యాను. మీరు కొంచం ఫిట్ గా ఉండాలని త్రివిక్రమ్ చెప్పడంతో నేను దాన్ని సీరియస్ గా తీసుకుని వర్క్ అవుట్ చేయడం స్టార్ట్ చేశా. దానికి తోడు నాకు మంచి ట్రైన‌ర్ దొరికాడు.

ఏం చేయాలో ఏం చేయకూడదో తనకు బాగా తెలుసు. అందుకే అనుకున్న స‌మ‌యానికి బాడీని ఓ షేప్‌లోకి తీసుకురాగ‌లిగా. బాడీ ఫిట్ గా ఉండటం కోసమే నేను సిక్స్ ప్యాక్ చేశాను. నన్ను చూసి మా వైఫ్ కూడా స్ఫూర్తి తీసుకుంది. డెలివరీ టైములో ఆమె చాలా లావైంది. "నువ్వు తగ్గవు కదా, నేను కూడా తగ్గి చూపిస్తా అంటుంది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

Similar News