త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ త్రివిక్రమ్ ఉంటాడు. సినిమా టైటిల్, సినిమాకి పెట్టుబడి, హీరోయిన్స్ ఎంపిక కానివ్వండి. ఇలా అన్ని విషయాల్లోనూ త్రివిక్రమ్ అన్నీ తానై వ్యవహరిస్తాడని అంటారు. అయితే అజ్ఞాతవాసి విషయంలో అన్ని త్రివిక్రమ్ చెప్పినట్టుగానే జరిగాయి, కానీ కొంతమంది ఆ సినిమాని త్రివిక్రమ్ డైరెక్ట్ చెయ్యలేదు, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ని డైరెక్ట్ చేసాడు. అందుకే ఆ సినిమా కి అంత ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చిందంటారు. ఇక పవన్ మీదున్న నమ్మకంతోనే త్రివిక్రమ్ చూసి చూడనట్టుగా ఉన్నాడంటారు. అజ్ఞాతవాసి టైటిల్ విషయంలోనూ, అజ్ఞాతవాసి పెట్టుబడి విషయంలోనూ, ఆ సినిమా హీరోయిన్స్ ఎంపికలో అన్ని త్రివిక్రమ్ అనుకున్నట్టుగానే జరిగాయనే టాక్ ఉంది.
టైటిల్ కి మిశ్రమ స్పందనే..అయినా..
కానీ ప్రస్తుతం అన్నీ త్రివిక్రమ్ కి వ్యతిరేకంగా హీరో అనుకున్నట్టుగానే జరుగుతున్నాయనే టాక్ బయటికి వచ్చింది. త్రివిక్రమ్ ఎప్పుడూ టైటిల్ విషయంలో ఫాన్స్ అండ్ ప్రేక్షకుల అభిప్రాయంతో ముందుకెళతాడు. చాలా టైటిల్స్ విషయంలో త్రివిక్రమ్ చేసింది అదే. ఆ టైటిల్ జనాల్లోకి చొచ్చుకుపోయాక తన సినిమా టైటిల్ ని బయటికి వదులుతాడు. కానీ ఎన్టీఆర్ సినిమా విషయంలో అది కుదర్లేదు. సినిమా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకు సినిమా టైటిల్ ముందుగా బయటికి వచ్చింది. అయితే అరవింద సమేత... వీర రాఘవ అనే టైటిల్‌కి ఫాన్స్ నుండి, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోన్న మాట నిజమే. కానీ అదే టైటిల్‌కి జనం అలవాటు పడుతున్నారని కూడా ఒప్పుకోవాలి. ఇదే టైటిల్‌ని విడుదలకి కొద్ది రోజుల ముందు అనౌన్స్ చేసినట్టయితే ప్రాచుర్యం పొందడానికి సమయం తీసుకునేది.
టైటిల్ ముందే పెట్టాలన్న ఎన్టీఆర్..
అయితే ఈ టైటిల్ గనక జనాలకు ఎక్కకపోతే మరో టైటిల్ పెడదామని, లేదంటే బాగా ఆలోచించి సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి టైటిల్ పెడదామని త్రివిక్రమ్ సూచించగా ఎన్టీఆర్ మాత్రం ఇలాంటి టైటిల్ ని ముందే వదలడం మంచిదని చెప్పాడట. అలాగే త్రివిక్రమ్ టైటిల్ చూసి క్లాస్ టైటిల్ అనుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పగా దానికి ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో మాస్ లుక్ వదులుదామని సలహా కూడా ఇచ్చాడట. మరి ఆ మాస్ లుక్ ని త్రివిక్రమ్ మాత్రం ఫాన్స్ కి సర్ ప్రైజ్ ట్రీట్ ఇవ్వాలని భావించినా చివరికి ఎన్టీఆర్ సజెషన్ కే త్రివిక్రమ్ కట్టుబడి రావాల్సి వచ్చిందనే ప్రచారం మొదలైంది.
అన్నింటా ఎన్టీఆర్ మాటే చెల్లుబాటు...
ఇంతకుముందు నుండి త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకి తనకిష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని తీసుకుందామనుకుంటే ఎన్టీఆర్ అది కూడా చెడగొట్టాడు. థమన్ ని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు. అలాగే హీరోయిన్ విషయంలోనూ అదే జరిగింది. అజ్ఞాతవాసి హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ ని ఎన్టీఆర్ సినిమా కోసం త్రివిక్రమ్ అనుకుంటే ఎన్టీఆర్ కాదని పూజ హెగ్డే ని సెలెక్ట్ చేయించాడనే ప్రచారమూ ఉంది. మరి ఇలా అజ్ఞాతవాసి డిజాస్టర్ తో త్రివిక్రమ్ కున్న పవర్స్ అన్ని పోయాయని, అందుకే ఎన్టీఆర్ తో ఎందుకులే అని ఎన్టీఆర్ చెప్పినదానికల్లా త్రివిక్రమ్ తలాడిస్తున్నాడని అంటున్నారు.