ఎన్టీఆర్, వైఎస్సార్ ల బయోపిక్స్ కి తేడా ఇదే..

Update: 2018-05-31 06:37 GMT

టాలీవుడ్ లో బయోపిక్స్ కు ఎప్పుడూ డిమాండ్ ఉండేది కానీ మరీ ఇంత డిమాండ్ గతంలో ఎప్పుడూ లేదని లేటెస్ట్ గా 'మహానటి' సినిమాతో అర్ధం అయింది. కంటెంట్ ఉన్న బయోపిక్ ను తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని రుజువు చేసారు. ఈ 'మహానటి' బయోపిక్ మరి కొన్ని బయోపిక్స్ కు దారి తీసింది.

సినిమాల నేపథ్యంలోనే...

'మహానటి' సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే 'ఎన్టీఆర్', 'వైఎస్సార్' బయోపిక్స్ పై ప్రకటనలు వచ్చాయి. వీటిలో కంటెంట్ గురించి ఇప్పుడు విపరీతంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ముందుగా 'ఎన్టీఆర్' బయోపిక్ గురించి మాట్లాడుకుంద్దాం. 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఈ సినిమా మొత్తం ఎన్టీఆర్ ఖ్యాతి గురించి ప్రచారం చేసే యాంగిల్ లోనే ఎక్కువ స్క్రిప్ట్ ను నడిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ దాదాపు 70 గెటప్స్ వేయనున్నారు. అంటే దీని బట్టి 'ఎన్టీఆర్' బయోపిక్ లో 'ఎన్టీఆర్' నటన ప్రస్తావన గురించి ఎక్కువుగా చెప్పనున్నారు. అయన పర్సనల్ లైఫ్, రాజకీయ కోణం కొంచం తక్కువగానే చూపించనున్నారని అర్ధం అవుతుంది.

పొలిటికల్ యాంగిల్ లో...

కానీ 'వైఎస్సార్' బయోపిక్ ఇందుకు భిన్నంగా సాగనుందని అంటున్నారు. 'వైఎస్సార్' రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి సినిమా మొత్తం ప్రత్యర్ధి పార్టీల మీద విమర్శల బాణాలు బాగా ఎక్కువగానే ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఇటు సినిమాటిక్ టచ్ తో పాటు అటు పొలిటికల్ యాంగిల్ ను కూడా ఎక్కువగానే చూపించనున్నారట.

 

Similar News