నాగార్జున - రామ్ గోపాల్ వర్మ సినిమా 'ఆఫీసర్' కథ నాదే అంటూ జయకుమార్ అనే రచయిత పోరాటానికి సిద్ధమయ్యాడు. గతంలో రాముపై పలు కేసులు పెట్టిన జయకుమార్ మరోమారు పోరాటానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సంధర్భంగా జయకుమార్ మీడియాకి ఓ లేఖ విడుదల చేశాడు.
మార్పులు కూడా చేసి ఇచ్చా...
అందులో...‘రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ నటించిన ‘సర్కార్ 3’ సినిమాతో రచయితగా పరిచయమయ్యానని, నేను వర్మని 2015 లో తొలిసారిగా కలిశానని పేర్కొన్నాడు. అదే ఏడాదిలో నేను రాముకి పోలీస్ ఆధికారికి సంబంధించి ఓ స్టోరీ చెబితే దానికి రాము ఇంప్రెస్స్ అయ్యాడని తెలిపాడు. దాంతో నేను ఆ స్టోరీని రాముకి ఇమెయిల్ ద్వారా పంపానని ఆయన పేర్కొన్నాడు. ఆ కథను చూసిన వర్మ కథలో కొన్ని మార్పులు కోరితే ఆ మార్పులు కూడా చేసి తిరిగి ఆయనకు పంపానని వివరించాడు.
నా కథతోనే సినిమా...
ఆ తర్వాత 'ఆఫీసర్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించి వర్క్ స్టార్ట్ అయ్యినప్పుడు కాంపెన్సేషన్, క్రెడిట్ ఇస్తానని హామీ ఇచ్చిన వర్మ తర్వాత తననెప్పుడూ సంప్రదించ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కథను గుడ్డిగా కాపీ కొట్టి సినిమా తీయడం తనకు బాధ కలిగిస్తోందన్నాడు. నా పర్మిషన్ లేకుండా నా హక్కులను ఉల్లంఘించి, నా సినిమా భవిష్యత్తును వర్మ దెబ్బతీశాడు’ అని జయకుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చి తనకు న్యాయం చేసేలా చూడాలని జయకుమార్ అభ్యర్థించాడు.