ఈ ఆఫీసర్ పై నమ్మకం ఉంది..

Update: 2018-05-31 13:22 GMT

కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం 'ఆఫీసర్'. కంపెనీ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రామ్ గోపాల్ వ‌ర్మ‌, సుధీర్ చంద్ర ఈ సినిమాను నిర్మించారు. జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంభందించి మాట్లాడడానికి హీరో నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరోయిన్ మైరా సరీన్ మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ మైరా స‌రీన్ మాట్లాడుతూ..."నాగార్జున‌, రామ్‌గోపాల్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. ఆడియన్స్ నా పాత్రను చూసి ఎంజాయ్ చేస్తారు. ఆఫీసర్ సినిమాలో నా రోల్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పదలుచుకోలేదు. వర్మతో వర్క్ చెయ్యడం అద్భుత‌మైన ఎక్స్‌ పీరియెన్స్‌. ఆఫీసర్ సినిమా అన్ని వర్గాల వారిని అలరిస్తోందని నమ్ముతున్నాను" అన్నారు.

మధ్యలో వదిలేస్తారా అని భయపడ్డా...

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ..."ఆఫీస‌ర్ క‌థ వర్మ నాకు చెప్పిన‌ప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. కానీ వర్మ ఈ సినిమా చేస్తున్నప్పుడు మధ్యలో వేరే సినిమా అవకాశం వచ్చిందని వెళ్లిపోతాడేమో అని భయం వేసింది. మళ్ళీ 4 నెలల తరువాత వచ్చి అదే కథ చెప్పి తప్పకుండా చిత్త శుద్ధితో ఈ సినిమా చేస్తానని చెప్పడం జరిగింది. వర్మ చెప్పినట్లుగానే ఈ సినిమా తీసి చూపించాడు. నేను ఈ సినిమాపై పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉన్నాను. శివ విడుదల తరువాత అందరు ముఖ్యంగా సౌండ్ గురించి మాట్లాడారు. ఆఫీసర్ సినిమా విడుదల తరువాత కూడా సౌండ్ ఎఫెక్ట్స్ గురించే మాట్లాడుకుంటారని నమ్ముతున్నాను. ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల గుండెను తాకేలా ఉంటాయి" అన్నారు.

ఓ పోలీస్ చెప్పిన లైన్ తో...

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...ఆఫీసర్ సినిమాలో నాగార్జున పాత్ర కొత్తగా ఉండబోతోంది. శివ సినిమా తరువాత నేను పూర్తి స్థాయిలో హీరో ఎలివేషన్ సినిమాను ఆఫీసర్ తో చెయ్యడం జరిగింది. క్రిమిన‌ల్స్ నుండి సోసైటీని కాపాడ‌టం పోలీస్ ఆఫీస‌ర్స్ వృత్తి. ముంబైలో ఓ పోలీస్ ఆఫీస‌ర్ చెప్పిన పాయింట్‌ను ఆధారంగా ఆఫీసర్ కథను రాసుకోవడం జరిగింది. రిస్క్ తీసుకునేవాడే హీరో. నేను రాసుకున్న పోలీస్ ఆఫీసర్ పాత్రకు నాగార్జున పూర్తిగా న్యాయం చేశాడు. నేను రాసుకున్న పాత్ర నాగార్జున రూపంలో ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాను. ఇంత ఇంటెన్షన్ తో నటించినందుకు నాగార్జున‌కి కృతజ్ఞతలు చెప్తున్నాను. సినిమా ఆడియన్స్ ను అట్రాక్ట్ చెయ్యబోతోందని నమ్ముతున్నాను" అన్నారు.

Similar News